తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని, కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకున్నానన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంఖుస్థాపన ల తరువాత పెద్ద గూడెం వద్ద బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రాములు,ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి,కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్నారు.. కేసీఆర్ గారు దేశ ప్రధాని కావాలి…జోగులాంబ అమ్మవారిని కోరుకున్నాను.. దేశంలో కూడా తెలంగాణ అమలవుతున్న పథకాలు అమలుకావాలి. పక్క రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ని గమనిస్తున్నాయి.
Read ALso: Pathan Controversy: పఠాన్ వివాదం.. ప్రవక్తపై మధ్యప్రదేశ్ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
పాలమూరు నుండి లక్షల మంది వలస వెళ్లే వారు..నేడు తెలంగాణ కు ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది వలస వస్తున్నారు..ఆరోగ్య తెలంగాణ కోసం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటున్నాం..ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. బీజేపీ మాయమాటలు నమ్మొద్దు..మన పార్టీ బి ఆర్ ఎస్…సీఎం కేసీఆర్ ప్రధాని కావాలన్నారు. మరో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీల విద్య కోసం అనేక గురుకులాలు,కళాశాలలు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలాంటి ప్రయత్నం చేయలేదన్నారు.
1,60,600 మంది బిసి బిడ్డలు గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. నూతనంగా 16 బిసి డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం. కరీంనగర్, వనపర్తి లో బిసి అగ్రికల్చర్ డిగ్రీ మహిళ కాలేజ్ ను ఏర్పాటు చేసుకున్నాం. బీసీ బిడ్డలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏం జరిగిందో వనపర్తిని చూస్తే తెలుస్తుంది. గురుకులాల ఏర్పాటు లో తెలంగాణ దేశానికే ఆదర్శం. గురుకుల స్కూల్స్,ఇంటర్ ,డిగ్రీ కాలేజ్ లు, పెద్దయెత్తున ఏర్పాటు చేసుకున్నాం.. మన ఊరు మన బడి కార్యక్రమంతో స్కూల్ లను బాగు చేస్తున్నాం అన్నారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. భవిష్యత్ లో హైదరాబాద్ లో ఉన్నవారు వనపర్తిలో చదవాలని ఆసక్తి చూపుతారన్నారు.
నేడు వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని గోపాల్ పేట రహదారిలో సహచర మంత్రులు @SabithaindraTRS గారు, @SingireddyTRS గారు, @chmallareddyMLA గారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వ JNTU ఇంజనీరింగ్ కళాశాల, మరియు పీజీ కళాశాలను ప్రారంభించడం జరిగింది.@BRSparty pic.twitter.com/fsCgIVJ992
— Gangula Kamalakar (@GKamalakarTRS) December 19, 2022
మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. జేఎన్టీయూ కాలేజ్ ను వనపర్తిలో ఏర్పాటు చేసుకున్నాం.. రాష్ట్రంలో నాలుగు క్యాంపస్ లు ఉంటే వనపర్తి లో ఐదో కళాశాల ఏర్పాటు చేసుకున్నాం. కేజీ టూ విద్య లో భాగంగా వనపర్తి లో మెడికల్ కాలేజ్,నర్సింగ్ కాలేజ్,పీజీ సెంటర్,ఇంజినీరింగ్ కాలేజ్,బీఎస్సి అగ్రికల్చర్ ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసాం అన్నారు. వ్యవసాయ డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చేసుకున్నాం.. ఈ సంవత్సరం 120 మంది విద్యార్థులు అగ్రికల్చర్ డిగ్రీ చదువుతారు…. కోటి 46 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చాం అన్నారు. రైతు బంధు నిధుల్లో ఎక్కువశాతం ఎస్సి,ఎస్టీ,బిసి రైతులకు అందుతుంది. కోటి రెండు లక్షల ఎకరాల భూమి ఎస్సి,ఎస్టీ,బిసి రైతులకు చెందింది ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
Read Also: Lionel Messi: మెస్సీ అస్సాంలో పుట్టాడు.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ వైరల్