Nimisha Priya Case: యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటుున్న కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా కేసులో కేంద్రం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. మరణశిక్ష రద్దు నివేదికల్ని భారత్ తిరస్కరించింది. ఈ కేసుపై భారత్, యెమెన్‌తో కలిసి పనిచేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) తెలిపింది.
భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షను యెమెన్ అధికారులు వాయిదా వేశారు. ఉరిశిక్ష నిలిపివేతకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. యెమెన్ ప్రభుత్వ పెద్దలతో భారత ప్రభుత్వం మంతనాలు చేస్తోంది. ఎలాగైనా ఉరిశిక్షను నిలిపివేసేందుకు భారత్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.
Nimisha Priya: యెమెన్ దేశంలో కేరళకు చెందిన నర్సు ఉరికంబం ఎక్కేందుకు సిద్ధమైంది. 2017లో ఆ దేశ జాగీయుడైన తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కారణంగా జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. 36 ఏళ్ల నిమిషాకు 2020లో అక్కడి న్యాయవ్యవస్థ మరణశిక్షను విధించింది. అయితే, నిమిషాను కాపాడేందుకు ససేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్ అధికారులు, యెమెన్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది.