Nimisha Priya: నిమిషా ప్రియ ఉరిశిక్ష నిలిపివేతకు ఛాన్స్! కొనసాగుతున్న మంతనాలు
- నిమిషా ప్రియ ఉరిశిక్ష నిలిపివేతకు ఛాన్స్!
- కొనసాగుతున్న మంతనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షను యెమెన్ అధికారులు వాయిదా వేశారు. ఉరిశిక్ష నిలిపివేతకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. యెమెన్ ప్రభుత్వ పెద్దలతో భారత ప్రభుత్వం మంతనాలు చేస్తోంది. ఎలాగైనా ఉరిశిక్షను నిలిపివేసేందుకు భారత్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగానే యెమెన్ అధికారులు.. ఉరిశిక్ష అమలును నిలిపివేశారు. అయితే ఉరిశిక్ష నిలిపివేతకు నర్సు కుటుంబం.. స్థానిక అధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నష్ట పరిహారంగా బాధిత కుటుంబానికి రూ.8.5 కోట్లు నర్సు కుటుంబం ఆఫర్ చేసింది. కానీ బాధిత కుటుంబం మాత్రం అంగీకరించలేదు. ఒకవేళ నర్సు కుటుంబం విజ్ఞప్తిని అధికారులు పరిగణనలోనికి తీసుకుంటే మాత్రం ఉరిశిక్ష నిలిచే అవకాశం ఉంది. ఈ మేరకు భారత ప్రభుత్వం కూడా యెమెన్ అధికారులు ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు. ఈ చర్చలేమీ ఫలించకపోతే మాత్రం నిమిషా ప్రియ ఉరి కంభం ఎక్కాల్సిందే.
ఇది కూడా చదవండి: Bhatti Vikramakra : ఫ్యూచర్ సిటీ గేమ్ ఛేంజర్.. అవి పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందదు
Also Read
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ 2017, జూలైలో యెమెన్ జాతీయుడు తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కేసులో అరెస్టు అయింది. మరొక నర్సు సహాయంతో మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి అతని శరీరాన్ని ముక్కలు చేసి, అవశేషాలను భూగర్భ ట్యాంక్‌లో పడవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నిమిషా ఈ ఆరోపణలను కోర్టులో సవాలు చేసింది. కానీ కోర్టులు ఆమె అప్పీళ్లను తోసిపుచ్చాయి. చివరికి ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చింది. అనంతరం న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష విధించింది.
ఇది కూడా చదవండి: Janasena: భిన్నత్వంలో ఏకత్వం.. జాతీయ సమగ్రత, భాషా సామరస్యంపై పవన్ ఆలోచన అదే..
నిమిషా ప్రియ.. 2008 నుంచి యెమెన్‌లో నర్సుగా పనిచేస్తోంది. 2011లో వివాహం తర్వాత ఆమె తన భర్త టామీ థామస్‌తో కలిసి యెమెన్ దేశానికి వెళ్లింది. 2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం కారణంగా ఆమె భర్త కుమార్తెతో కేరళకు తిరిగి వచ్చేశాడు. నిమిషా మాత్రం యెమెన్‌లోనే ఉండిపోయింది. అనంతరం ఆమె యెమెన్ జాతీయుడితో కలిసి నర్సింగ్ హోమ్ ప్రారంభించింది. అయితే ఆమెపై మెహదీ అఘాయిత్యం చేయబోయాడు. అనేక మార్లు శారీరికంగా వేధించాడు. అంతేకాకుండా పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నాడు. అయితే పాస్‌పోర్టును తిరిగి పొందే క్రమంలో మత్తు మందులు ఇచ్చానని.. కానీ అతడు అధిక మోతాదులో తీసుకోవడం వల్లే చనిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైలులో ఉంది.
ఇక ఉరిశిక్షను ఆపాలంటూ ప్రధాని మోడీకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఈ మేరకు ఫిబ్రవరి 6, మార్చి 24, 2025న లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖలు పంపి విజ్ఞప్తి చేశారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్ కూడా కేంద్రాన్ని కోరారు.
అయితే ప్రస్తుతం యెమెన్ దేశం హౌతీల నియంత్రణలో ఉంది. దీంతో దౌత్యపరంగా భారత్‌కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆమె విడుదల కోసం కేంద్రం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. అయితే బాధితుడు.. ఒక పెద్ద కుటుంబంతో సత్సంబంధాలు ఉండడంతో మంతనాలు చురుగ్గా సాగడం లేదు. అయినప్పటికీ భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నర్సు కుటుంబ సభ్యులు, భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఏం జరుగుతుందో మరికొన్ని వేచి చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?