చూడగానే మనకు బాగా పరిచయం ఉన్న అబ్బాయిలా కనిపిస్తాడు. మన పక్కింటి కుర్రాడే అనిపిస్తాడు నిఖిల్ సిద్ధార్థ్! తనదైన చలాకీ అభినయంతో సాగుతున్న నిఖిల్ నవతరం ప్రతినిధిగా కనిపించే పాత్రల్లో సాగుతున్నాడు. నిఖిల్ సిద్ధార్థ్ 1985 జూన్ 1న హైదరాబాద్ లో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు. తరువాత ‘ముఫ్పఖమ్ ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’లో బి.టెక్, చదివాడు. అతని మనసు చదువుకొనే రోజుల నుంచీ సినిమాలపైనే లగ్నమయింది. ఇంట్లో వాళ్ళు…