Reasi Bus Terror Attack : జమ్మూకశ్మీర్‌లోని రియాసి బస్సు దాడికి సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈరోజు రెండు జిల్లాల్లోని ఏడు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది.
బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరారీ కేసులో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లోని ఆరు రాష్ట్రాల్లోని 100కి పైగా సోదాలు నిర్వహించింది. వివిధ ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్‌స్టర్‌లకు, డ్రగ్స్ స్మగ్లింగ్ మాఫియాకు ఉన్న సంబంధాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్న అనుమానితులపై భారీ అణిచివేతలో భాగంగా ఈరోజు కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్, అల్‌ఖైదాతో సంబంధాలున్న కొందరు అనుమానితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం ముంబై, బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.