NIA Searches: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్, అల్‌ఖైదాతో సంబంధాలున్న కొందరు అనుమానితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం ముంబై, బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద కార్యకలాపాలను వ్యాప్తి చేయడానికి, దేశ ఐక్యత, భద్రత, సార్వభౌమాధికారానికి హాని కలిగించడానికి నిందితులు పన్నిన కుట్రకు సంబంధించిన కేసుతో ఈ దాడులకు సంబంధాలు ఉన్నాయని తెలిసింది. సోదాల సమయంలో, అనుమానితుల ఇళ్ల నుంచి డిజిటల్ పరికరాలు, నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, అనుమానితుల్లో కొందరిని విచారణ కోసం తీసుకున్నట్లు తెలిసింది.
గత నెలలో ఎన్‌ఐఏ కర్ణాటక వ్యాప్తంగా ఆరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. శివమొగ్గ ఇస్లామిక్ స్టేట్ కుట్ర కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. దక్షిణ కన్నడ, శివమొగ్గ, దావణగెరె, బెంగళూరులో సోదాలు జరిగాయి. అరెస్టయిన వారిని ఉడిపిలోని బ్రహ్మావర్‌లోని వరంపల్లికి చెందిన రేషాన్ థాజుద్దీన్ షేక్, కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన హుజైర్ ఫర్హాన్ బేగ్‌గా గుర్తించారు.మాజ్ మునీర్ తన సన్నిహిత సహచరుడు, కళాశాల సహచరుడైన రేషాన్ థాజుద్దీన్‌ను తీవ్రంగా మార్చాడని, నిందితులు ఇద్దరూ తమ ఐసిస్ హ్యాండ్లర్ నుంచి క్రిప్టో-వాలెట్ల ద్వారా నిధులు పొందారని ఈ కేసు దర్యాప్తులో వెల్లడైంది.
Earthquake: సూరత్‌లో భూకంపం.. 3.8 తీవ్రతతో కంపించిన భూమి..
హింసను రేకెత్తించేందుకు వారు మద్యం దుకాణాలు, గోడౌన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, వాహనాలు, ఇతర సంస్థలను కాల్చడమే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ కేసును మొదట సెప్టెంబరు 19, 2022న శివమొగ్గ రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది, అయితే తర్వాత నవంబర్ 15, 2022న ఎన్‌ఐఏ మళ్లీ కేసు నమోదు చేసింది.