రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు భారత్, చైనాపై కారాలు.. మిరియాలు నూరుతున్నారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ప్రధాని మోడీ మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. జూలై 23-26 తేదీల్లో యూకే, మాల్దీవుల్లో మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపింది. ఇటీవలే ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. కొద్ది రోజుల గ్యాప్‌లనే మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు.
ప్రధాని మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. బ్రూనై, సింగపూర్ టూర్‌కు వెళ్లారు. అక్కడ నుంచి రాగానే జమ్మూకాశ్మీర్‌లో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8 నుంచి ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొననున్నారు. మూడు ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని పాల్గొంటారని, జమ్మూ ప్రాంతంలో రెండు చోట్ల, కశ్మీర్‌లో ఒక చోట బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని ప్రచారం సాగిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధులు వచ్చేవారం విడుదల కానున్నాయి. జూన్ 18న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోడీ పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ శనివారం వెల్లడించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను గురువారం లేదా వచ్చే వారం విచారించే అవకాశం ఉంది.
ChatGPT: ఈ పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్ బోట్.. చాట్‌జీపీటీకి పాపులారిటీ పెరిగిపోయింది. ఈ యాప్ వాడకానికి నెటిజన్ల నుంచి పరిశోధకులు, ఐటీ నిపుణులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రతి ఒక్కరిలోనూ ఈ యాప్ పై ఆసక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐ.. యూజర్ల కోసం ఆండ్రాయిడ్ వర్షన్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది. వచ్చే వారంలో ఆండ్రాయిడ్…
అకాల వర్షాల వల్ల ఇప్పటికే పంట నష్టంతో అల్లాడిపోతున్న అన్నదాతలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను రానుందని.. ఆగ్నేయ బంగాళఖాతంలో తుపాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.