తెలంగాణలో ఇంకా కుదురుకోలేదు. పాదయాత్ర పేరుతో ఖమ్మం జిల్లాను చుట్టేస్తున్నారు వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. తాజాగా ఆమె ఎక్కడినించి పోటీచేస్తానో క్లారిటీ ఇచ్చేశారు. పాలేరు పై షర్మిల కన్ను వెనుక వ్యూహం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. పాలేరు కాంగ్రెస్ కు పెట్టని కోట. అక్కడ కాంగ్రెస్ కు ఎప్పుడూ గెలుపు నల్లేరు మీద బండి నడకే. కాంగ్రెస్ గెలుపు షర్మిలకు కలసి రానుందంటున్నారు. టీఆర్ఎస్ వర్గ పోరు షర్మిలకు కలసి రానుందనేది మరో వర్గం…
దేశంలో తాత్కాలిక ప్రయోజనాల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అది రాబోయే తరాలకు ప్రమాదకరం అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. పీపుల్స్ మార్చ్ పేరుతో ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేపట్టారు భట్టి విక్రమార్క. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక విషయాలు ప్రస్తావించారు. తనదైన రీతిలో సమాధానాలిచ్చారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం మోడీ ప్రయత్నించడం పట్ల లౌకికవాదులు కళ్ళు తెరవాలన్నారు. సీఎల్పీ నేతగా తాను రాష్ట్రమంతా యాత్రలు చేస్తా. పీసీసీ అధ్యక్షుడిగా…
టీడీపీ నేతలపై ఒకరేంజ్‌లో ఫైరయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అయ్యన్న పాత్రుడు మహిళా మంత్రి పై చెప్పిన మాటలు వింటే మహిళలు ఎవరూ టీడీపీకి ఓటు వేయరన్నారు. 151 కోట్ల స్కాం చేసిన అచ్చెన్నాయుడును బొక్కలో వేయకుండా ఏం చేస్తారు? రాష్ట్రంలో ఎవరికీ ఇంగ్లీష్ వద్దంటాడు చంద్రబాబు…తన కొడుకును మాత్రం ఇంగ్లీషులో చదివిస్తాడన్నారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబుకు సిగ్గుందా? చంద్రబాబు హయాంలో 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే జగన్ ప్రభుత్వం 62 లక్షల మందికి ఇస్తోంది.…
కేశినేని నాని కేంద్రంగా బెజవాడ టీడీపీ రాజకీయం మరోసారి వేడెక్కుతోందా? కొత్తగా కేశినేని వర్సెస్ కేశినేని అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా? ఎందుకలా? విజయవాడ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఈ ఎపిసోడ్‌లో మరోవర్గం ఎలాంటి పాత్ర పోషిస్తోంది? కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని బెజవాడ టీడీపీలో అగ్గి రాజుకున్నట్టే కన్పిస్తోంది. నిన్నటి వరకు ఎంపీ కేశినేని నాని వర్సెస్ మిగిలిన లీడర్లు అన్నట్టుగా ఉండేది. కేశినేని నానికి వ్యతిరేకంగా బుద్దా వెంకన్న, నాగుల్ మీరా,…
ఆ ఇద్దరికి మొదటి నుంచి పడదు. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో ఇద్దరూ ఒకే గూటికి చేరుకున్నారు కూడా. ఆ సమయంలో ఒక ఒప్పందం జరిగిందట. ఇప్పుడా అగ్రిమెంట్ రుచించలేదో ఏమో.. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇంతకీ ఎవరా నేతలు..? ఏంటా ఒప్పందం..? రచ్చబండతో రచ్చ రచ్చ పీసీసీ మాజీ చీఫ్.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా…