తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. తెలంగాణలో కుటుంబ పాలన పతనం ప్రారంభమైందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు డాక్టర్ లక్ష్మణ్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివార్లలో ఉన్న రేణుక ఎల్లమ్మ గుడి లో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు డా.లక్ష్మణ్. కుటుంబ పాలన పతనం ప్రారంభమైందన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కుటుంబ పాలన పతనం ప్రారంభమైందని, ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా వున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఘాటుగా విమర్శించారు. సామాన్య కార్యకర్తకు ఎంపీ పదవి దక్కింది అది బిజెపితోనే సాధ్యం అయిందన్నారు. అభివృద్ధిని చూసి అక్కసుతోనే స్థాయిని మించి మాట్లాడుతున్నాడు కేసీఆర్ అని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. దొడ్డి దారిన బిడ్డకు ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించింది కేసీఆర్ కాదా అని అన్నారు. ఒక్క బీజేపీ మీటింగ్ తోనే కేసీఆర్ కి గుబులు మొదలైంది..అందుకే ముందస్తు ఎన్నికల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు వస్తే బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్.
IND Vs ENG: అభిమానులకు నిరాశ.. రెండో వన్డేకు కూడా కోహ్లీ దూరం