గ్రూప్ రాజకీయాల ఉక్కపోత భరించలేక ఆ ఎమ్మెల్యే రాజీనామా అస్త్రం సంధించారా? అసలు ఉద్దేశాలు పసిగట్టిన అధిష్ఠానం విరుగుడు మంత్రం వేసిందా? విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు ‘అమ్మ.. వాసుపల్లి’ అని ఆశ్చర్యపోతున్నాయా? ముసళ్ల పండగ ముందుంది అని వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది ఎవరు? ఏమా కథా? వాసుపల్లికి లోకల్ వైసీపీ నేతల తీరు మింగుడు పడటం లేదా? రాజకీయాలు అంటేనే గ్రూపులు ఉంటాయి. అందులోనూ అధికారపార్టీ అయితే ఆ సమస్య మరింత జఠిలం. రెండు, మూడు…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పటిష్టత కోసం ఆ పార్టీ నాయకత్వం కృషిని ప్రారంభించింది. పార్టీలో అసంతృప్తి వాదులుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి లు పార్టీ కార్యాలయానికి వచ్చేలా చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఇది పార్టీ లో ఒక్కవిజయంగా కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నప్పటికి పార్టీలో ఎటువంటి పదవులు లేకుండా ఉన్న వారిని కూడా దగ్గరకు తీసుకునే చర్యలు పార్టీ చేపట్టినట్లుగా అయ్యింది. పోలీసుల వినియోగాన్ని…
టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. భవానీపురంలో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని భవానీ పురంలో ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి. మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, జోగి రమేష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఏడు స్థానాలు గెలిచి సీఎంకి బహుమతిగా ఇస్తామన్నారు వెల్లంపల్లి. 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు నిర్మించుకుంటాం. ఏడాది గడువులో…
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వంపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్ షాపుకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. అనుమతి తీసుకుని సమావేశానికి పలువురు నేతలు హాజరుకాలేదు. మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి సమావేశానికి వచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వర్క్‌షాపును ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమం. దాదాపు 8 నెలలపాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఒక్కో…
ఏపీలో తూర్పుగోదావరి రాజకీయాలు గోదావరి అంత ప్రశాంతంగా వుండవు. తుఫాన్ వచ్చినప్పుడు లంక గ్రామాల్ని ముంచేసినట్టుగా అక్కడ రాజకీయాలు హాట్ హాట్ గా వుంటాయి. తాజాగా జనసేన-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంగళగిరిలో జరిగిన జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి దాడిశెట్టి రాజా కౌంటరేశారు. అంబేద్కర్ జిల్లా ప్రకటించినందుకు పవన్, చంద్రబాబు అల్లర్లు సృష్టించారన్నారు. మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టి చంద్రబాబు, పవన్ ఆ మంటల్లో చలికాసుకున్నారు. కోనసీమ అల్లర్లలో…
మాదిగలకు అన్యాయం చేసే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామన్నారు మందకృష్ణ మాదిగ. మాదిగల సంగ్రామ పాదయాత్రను ప్రారంభించిన మందా కృష్ణమాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకూ 88 నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగనుంది. పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణకు ముందుకు రానిపక్షంలో ఎందుకు పార్టీ తీర్మానాలు చేసారో బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ పాలకులకు చిత్త శుద్ధి లేదు. మాదిగలను మరో ఉద్యమానికి సిద్దం చేసేందుకు , కేంద్రంపై ఒత్తిడి…
జగన్ పాలనపై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. జగన్ ఉన్మాది లా వ్యవహరిస్తున్నారు. నిన్ననే సీబీఐ అధికారులు చెప్పారు. వివేకా హత్య కేసులో స్థానిక అధికారులు సహకరించలేదు అని. గతంలో పరిటాల రవిని చంపారు. హత్యలు చేసి తప్పించుకోవడం…రాజకీయం చేయాలని చూస్తున్నారు. షర్మిల, ఎల్వీ సుబ్రమణ్యం, సవాంగ్ ఎక్కడున్నారు. రాయలసీమకు జగన్ ఏమీ చేశాడో చర్చించేందుకు సిద్దం. పులివెందుల కు ఏం చేశారో చెప్పండి. రాబోయే ఎన్నికల్లో…
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలో తమ పార్టీదే ఆధిపత్యం అంటున్నారు పాల్. కాంగ్రెస్ పని అయిపోయిందని, ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసేది ప్రజాశాంతి పార్టీయే అన్నారు ఆ పార్టీ చీఫ్ కేఏ పాల్. రాబోయే ఎన్నికలపైనే తాను ఫోకస్ పెట్టానంటున్నారు. ఆ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానం మినహా ఏపీ, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారత రాష్ట్రాలతోపాటు…
కేటీఆర్ మాటలు గురివింద సామెత లెక్క ఉన్నాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీ కుటుంబం తో పోల్చుకునే ప్రయత్నం చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు. దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్ళిన కుటుంబం గాంధీ కుటుంబం అన్నారు రేవంత్.
ఒకప్పుడు సర్వీసు పూర్తయితే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం ఆలోచించేవారు ఉద్యోగులు. ఇప్పుడు సీన్ రివర్స్. డ్యూటీలో ఉండగానే ఆలోచనలు మారిపోతున్నాయ్. ఖద్దరును లవ్వాడే పనిలో ఉన్నారు కొందరు ఉద్యోగ సంఘాల నేతలు. రాజకీయ నాయకులుగా కొత్త అవతారం ఎత్తే.. ఎత్తుగడల్లో ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఆ జాబితాలో చేరి హడావిడి చేస్తున్న ఓ ఉద్యోగ సంఘం నేతపై ప్రస్తుతం ఆసక్తిర చర్చే జరుగుతోంది? ఆయనెవరో? ఏం చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. షార్ట్ కట్‌లో లీడరైపోవచ్చనే పోకడలు…