Ponnala Vs Kommuri: ఒకే ఒరలో రెండుకత్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఇద్దరికి మొదటి నుంచి పడదు. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో ఇద్దరూ ఒకే గూటికి చేరుకున్నారు కూడా. ఆ సమయంలో ఒక ఒప్పందం జరిగిందట. ఇప్పుడా అగ్రిమెంట్ రుచించలేదో ఏమో.. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇంతకీ ఎవరా నేతలు..? ఏంటా ఒప్పందం..?
రచ్చబండతో రచ్చ రచ్చ
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
పీసీసీ మాజీ చీఫ్.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం ముదిరిపోయింది. 2009లోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ వరకు న్యాయపోరాటం చేసిన నాయకులు వీరిద్దరూ. అలాంటిది పదేళ్ల తర్వాత అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకరికొకరు హస్తం అందించుకుని నేస్తమయ్యారు. ఆ సమయంలో వారి మైత్రీని చూసిన వాళ్లంతా ఇద్దరూ కలిసిపోయారనే అనుకున్నారు. కానీ.. తెలంగాణలో పీసీసీ నిర్వహిస్తున్న రచ్చబండ వీరిమధ్య మరోసారి విభేదాలకు తెరతీసింది.
జనగామ టికెట్ కోసం పోరాటం
చేర్యాల డివిజన్ దూల్మిట్టలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రచ్చబండకి వెళ్తుండగా ఆయన్ని పొన్నాల వర్గీయులు అడ్డుకున్నారు. ప్రతాప్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి చేశారు. దీంతో కాంగ్రెస్‌లో జనగామ జాతర రచ్చ రచ్చగా మారిపోయింది. పొన్నాల, కొమ్మూరి మధ్య అంతర్గతంగా కొనసాగుతున్న గొడవలు రోడ్డెక్కేశాయి. కొమ్మూరిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలన్నది పొన్నాల వర్గం డిమాండ్. ఇదంతా కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరాటంగా శ్రేణులు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనగామ కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరు నాయకులు పోటీపడుతున్నట్టు ఓపెన్ టాక్. ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
2018లో ఇద్దరి మధ్య ఒప్పందం?
2018 ఎన్నికల సమయంలో పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య ఒక ఒప్పందం జరిగిందట. అది కూడా ఒకసారి పొన్నాల ఎన్నికల్లో నిలుచుంటే..కొమ్మూరి మద్దతివ్వడం.. వచ్చే ఎన్నికల్లో కొమ్మురి పోటీ చేయడం ఆ ఒప్పందంలోని షరతులుగా ప్రచారం చేస్తున్నారు. ఆ ఎన్నికలు అయిపోయాయి.. పొన్నాల ఓడిపోయారు. ఇప్పుడు జనగామలో కొమ్మూరి యాక్టివ్ కావాలని చూస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కూడా. ఇది పొన్నాల వర్గానికి రుచించడం లేదు. వచ్చే ఎన్నికల్లో పొన్నాలే పోటీ చేస్తారని కుండబద్దలు కొట్టేస్తున్నారు. దీంతో రెండు శిబిరాల మధ్య మాటల దాడి పెరిగింది. ఒప్పందానికి కట్టుబడలేదని ఒకరు.. అలాంటిదేమీ లేదని మరోవర్గం విమర్శల వేడి పెంచుతోంది. ఒకవేళ అలాంటి ఒప్పందమే జరిగి ఉంటే బయట పెట్టొచ్చుగా అనేది కొందరు పార్టీ శ్రేణుల ప్రశ్న.
పరస్పరం దాడులు
ఈ వర్గపోరు ఫలితంగా జనగామ కాంగ్రెస్‌లో నేతల జాతర కొత్త పుంతలు తొక్కుతోంది. పరస్పరం దాడులు చేసుకునే వరకు తీవ్రత పెరిగింది. పొన్నాల పీసీసీ చీఫ్‌గా పనిచేసి ఉన్నారు. కొమ్మూరి మాజీ ఎమ్మెల్యే. ఇద్దరూ పార్టీలో తమ ప్రాబల్యం మేరకు పట్టు నిరూపించుకొనే పనిలో పడ్డారు. పరస్పరం ఫిర్యాదులు.. విమర్శలు.. ఆరోపణలు కామనైపోయాయి. మరి.. ఈ పంచాయితీకి పార్టీ పెద్దలు ఫుల్‌స్టాప్ పెడతారో లేక.. ఎన్నికల నాటికి విభేదాలు మరింత రసకందాయంలో పడాతయో చూడాలి.
తాజావార్తలు
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..