IND Vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఆడిన జట్టునే మూడో వన్డేలో టీమిండియా కొనసాగించింది. అటు న్యూజిలాండ్ మాత్రం ఓ మార్పు చేసింది. రెండో వన్డేలో ఆడిన బ్రాస్‌వెల్‌ను పక్కనపెట్టి ఆడమ్ మిల్నేను జట్టులోకి తీసుకుంది. వన్డే సిరీస్ కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పనిసరి గెలవాలి. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో మూడో మ్యాచ్ కీలకంగా మారింది.
Read Also: Zombie Virus: 48,500 ఏళ్ల నాటి జాంబీ వైరస్ వెలుగులోకి.. మరో 12 కొత్త వైరస్‌లు కూడా!
కాగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుని టీ20 సిరీస్ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఆతిథ్య న్యూజిలాండ్ భావిస్తోంది. మరోవైపు భారత్ మాత్రం ఎలాగైనా గెలిచి సిరీస్ కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది.
తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సూర్య, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజువేంద్ర చాహల్
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, ఆడమ్ మిల్నే, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గుసన్