న్యూయార్క్ ,లండన్ లలో కరెంట్ పోవచ్చు కానీ హైదరాబాద్ లో మాత్రం కరెంట్ పోదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు.
ATM Display: సాధారణంగా ఏటీఎంకు వెళ్తే డబ్బులు విత్‌డ్రా చేసుకుంటాం. అయితే వేరేవాళ్లు తమ ఖాతా వివరాలు తెలుసుకుని డబ్బులు దోచుకుంటారేమోనని భయంతో ట్రాన్సాక్షన్ ముగిసిన వెంటనే కొంతమంది నంబరు బోర్డుపై ఏవేవో అంకెలు నొక్కేసి బయటకు వస్తారు. బ్యాంకులో ఉన్న నిల్వ మొత్తం, ఇతర వివరాలు ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడతారు. అయితే అమెరికాలోని మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఏటీఎం మాత్రం ఖాతాదారుల గుట్టంతా విప్పేస్తోంది. ఒకసారి ఏటీఎం మిషన్‌లో కార్డుపెట్టి ఎదురుగా…
Viral News: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులు జాబ్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని జాబ్ ఆఫర్లు విచిత్రంగా ఉంటాయని చెప్పడానికి ఈ వార్తే నిదర్శనం. అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇచ్చిన జాబ్ ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎలుకలు పట్టేందుకు ఆయన ఓ కొత్త పోస్టు సృష్టించారు. ఈ జాబ్ ఆఫర్ ద్వారా ఏడాదికి రూ.1.38 కోట్ల శాలరీ ఇస్తామని ప్రకటించారు. ఈ వివరాలను ఆడమ్స్ తన…
snowstorm buries western New York: అమెరికా వాణిజ్యనగరం న్యూయార్క్ వ్యాప్తంగా భారీగా హిమపాతం కురుస్తుంది. దీంతో నగరంలోని రోడ్లపై భారీగా మంచు పేరుకుపోయింది. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్ బఫెల్లో ప్రాంతంలో మంచు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో 6 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజా జీవితం స్తంభించింది. బఫెలో ప్రాంతంలో రోడ్లు మూసేశారు. అనేక విమానాలు రద్దు అయ్యాయి. నగరంలో ప్రయాణాలు దాదాపుగా పరిమితం చేయబడ్డాయి.
Most millionaires in these cities: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సంపన్నులు ఎక్కువగా నగరాల్లోనే నివసిస్తున్నారు. ఎక్కువ మంది మిలియనీర్లు ఉంటున్న టాప్ -10 నగరాల్లో సగం అమెరికాలోనే ఉన్నాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్ పార్ట్‌నర్స్ గ్రూప్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం న్యూయార్క్, టోక్యో, శాన్ ప్రాన్సిస్కో బే ఏరియాల్లో అత్యధిక మంది మిలియనీర్లు నివసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
సర్కారు వారి పాట సినిమా విడుదలైన తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు వెకేషన్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్‌లో ఆనందంగా గడుపుతున్నాడు. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు విదేశీ టూర్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా అమెరికా పర్యటనలో న్యూయార్క్ నగరంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్‌ను మహేష్ బాబు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను…
రోడ్డుపై వీసమెత్తు బంగారం కనిపిస్తేనే వదలరు. అలాంటిది ఏకంగా 186 కిలోల బంగారం కనిపిస్తే చూస్తూ ఊరుకుంటారా చెప్పంది. అయితే, అంతపెద్ద మొత్తంలో ఒకే చోట ఉండటంతో చూసిన ప్రజలు షాక్ అయ్యారు. సూర్యకాంతిలో మెరిసిపోతున్న దానిని చూసి, ముట్టుకుంటూ ఫొటోలు దిగారు. 186 కిలోల 24 క్యారెట్ల బంగారంతో జర్మనీకి చెందిన నిక్లాస్ కాస్టెలో అనే ఆర్టిస్ట్ గోల్డెన్ క్యూబ్‌ను తయారు చేశాడు. ఈ గోల్డెన్ క్యూబ్ ను న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో ఉంచారు. అక్కడికి…
ఒకప్పుడు ఒకచోట నుంచి మరోచోటుకి ప్రయాణం చేయాలంటే నడిచి వెళ్లేవారు. ఆ తరువాత చిన్న చిన్న వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. రైట్ సోదరులు విమానం కనుగొన్న తరువాత ప్రయాణంలో వేగం పెరిగింది. ఇప్పుడు భూమిమీద నుంచి స్పేస్‌లోకి ప్రయాణం చేస్తున్నారు. అయితే, ఒక దేశం నుంచి మరోక దేశానికి ప్రయాణం చేయాలంటే విమానంలోనూ దూరాన్ని బట్టి సమయం ఉంటున్నది. దీంతో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విధంగానే హైస్పీడ్ విమానాలను తీసుకురావాలని అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు…
ఒకవైపు అమెరికాను కరోనాతో పాటు మరో సమస్య వణికిస్తున్నది. గత కొన్నిరోజులుగా అమెరికాలోని అనేక ప్రాంతాల్లో మంచుతుఫాను కురుస్తున్నది. మంచుతోపాటు వేగంగా గాలులు వీస్తుండటంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. దీనిని నార్ ఈస్టర్ అని పిలుస్తారు. ఈ పరిస్థితి మరింత దిగజారి పీడనం పడిపోతే మంచు గట్టలు గుట్టలుగా పడిపోతుంది. దీనిని బాంబ్ సైక్లోన్ అని పిలుస్తారు. ప్రస్తుతం అమెరికాలోని అనేక ప్రాంతాలను ఈ బాంబ్ సైక్లోన్ అతలాకుతలం చేస్తున్నది. మంచు అడుగులమేర పేరుకుపోయింది. న్యూయార్క్, బోస్టన్…