అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 19 అంతస్తులున్న ఓ అపార్ట్‌మెంట్‌లో హటాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా 60 మందికి గాయాలయ్యాయి. ఇందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతిచెందిన 19 మందిలో 9 మంది చిన్నారులు ఉన్నారు. మొదటి రెండు అంతస్తుల్లో అగ్నిప్రమాదం జరగడంతో మిగతా అంతస్తులలో నివశిస్తున్న వ్యక్తులు బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. Read: నకిలీ సర్టిఫికెట్‌లపై…
ఇండియా జెయింట్ వ్యాపార దిగ్గజం రిలయన్స్ అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే అనేక రంగాల్లోకి ప్రవేశించిన రిలయన్స్ సంస్థ తాజాగా హోటల్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగరంలోని మిడ్‌టౌన్ మాన్‌హట్టన్ లోని మాండేరియన్ ఓరియంటల్ ఫైవ్ స్టార్ హోటల్‌ను కొనుగోలు చేసేందుకు సిద్దమయింది. 100 మిలియన్ డాలర్లతో మాండేరియన్ ఓరియంటల్ హోటల్‌ను కొనుగోలు చేస్తున్నట్టు రిలయన్స్ సంస్థ స్పష్టం చేసింది. Read: రమేష్ బాబుపై మహేష్ బాబు ఎమోషనల్…
న్యూయార్క్‌ను ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. సెకండ్ వేవ్ సమయంలో న్యూయార్క్ నగరం ఎంతలా అతలాకుతలమైందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్న తరుణంలో మరోసారి ఆ నగరాన్ని కరోనా భయపెడుతున్నది. డెల్టా కంటే 6 రెట్లు ప్రమాదకరమైన ఒమిక్రాన్ న్యూయార్క్ నగరంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు న్యూయార్క్‌లో 8 కేసులు నమోదయ్యాయి. Read: వీడని ఒమిక్రాన్ భయం… ఆ గుట్టు బయటపడేదెప్పుడు… నగరంలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని న్యూయార్క్…
కరోనా సెకండ్ వేవ్ తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అంతా భావిస్తున్న తరుణంలో.. ఇప్పుడు కొత్త వేరియంట్ మళ్లీ గుబులు రేపుతోంది.. సౌతాఫ్రికాలో బయటపడిన బీ 1.1.529 ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ.. కునుకు లేకుండా చేస్తోంది.. ఇప్పటి వరకు కరోనాలో వెలుగుచూసిన వేరియంట్ల కంటే.. ఇది అత్యంత ప్రమాదకరం అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.. బీ.1.1.529ను ఆందోళనర వేరియెంట్‌గా గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ కొత్త వేరియెంట్‌కు ‘ఒమిక్రాన్’ అనే పేరు పెట్టింది.. Read Also:…
ప్రపంచంలో అత్యంత ఖరీదైన 10 నగరాల్లో న్యూయార్క్ కూడా ఒకటి. అక్కడ జీవించాలంటే ఒక వ్యక్తి సగటు వ్యయం 1341 డాలర్లు. మన కరెన్సీ ప్రకారం లక్ష రూపాయలు. నెలకు ఇంత ఖర్చు అంటే మనం నోరెళ్లబెడతాం. ఎంత తగ్గించుకున్నా కనీసం వెయ్యి డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. కానీ, ఓ మహిళ మాత్రం కేవలం నెలకు 200 డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తూ జీవనాన్ని సాగిస్తోంది. అంత ఖరీదైన నగంలో మరీ అంత తక్కువ ఖర్చుతో…
ఈరోజు నుంచి న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు అన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. కాగా, ఈ సదస్సు జరిగే సమయంలోనే సార్క్ దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం కావాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆఫ్గనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి తాలిబన్లను కూడా పిలవాలని పాక్ కొత్త మెలిక పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న ప్రస్తుత…
అమెరికా ప్రముఖ టెలివిజన్ షో దివైర్ సిరీస్ నటుడు మైఖేల్ కె విలియమ్స్ (54) మృతి చెందారు. రెండు రోజులుగా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఆయన స్నేహితుడు ఆపార్ట్ మెంట్ కు వెళ్లి చూసే సరికి మైఖేల్ శవంగా కనిపించాడు. ఆయన పక్కన డ్రగ్స్ విపరీతంగా ఉండటంతో ఆకారణంగానే చనిపోయి ఉంటాడని అధికారులు నిర్దారణకు వస్తున్నారు. డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్లే మృతి చెందినట్లు భావిస్తున్నారు. మైఖేల్ స్నేహితుడు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.…
గత నెల రోజుల క్రితం చైనాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వెయ్యేళ్ల కాలంలో ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో వర్షాలు కురవలేదని చైనా అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై నడుం లోతుల్లో నీళ్లు రావడంతో పాటుగా అటు షాపింగ్ మాల్స్, సెల్లార్లు, బస్సులు, రైళ్లు అన్నీ కూడా నీటిలో సగం వరకు మునిగిపోయిన దృశ్యాలను చూశాం. ఆ పరిస్థితి నుంచి బయటపడేసరికి చైనాకు తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. కాగా, ఇప్పుడు అమెరికాను భారీ…
రాత్రి ఎనిమిదికి మొదలైంది. వర్షం టెర్రర్…పదకొండు వరకు కంటిన్యూగా దంచుతూనే ఉంది…ఫలితంగా నగరం అతలాకుతలం…మూడుగంటల్లో మొత్తం అస్తవ్యస్తం….ఇదీ రాత్రి హైదరాబాద్‌లో రాత్రి జలప్రళయం… రాత్రి కురిసిన వానను చూసిన వారికి.. ఆకాశానికి చిల్లుపడిందా అనిపిచింది.. రోడ్లు కాల్వలయ్యాయి.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్.. ఇలా ప్రధాన కూడళ్లు చెరువు లయ్యాయి. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్. లోతట్లు ప్రాంతాల్లోని ఇళ్లలోకి మోకాలిలోతు నీరు చేరింది. కృష్ణానగర్ ఎ-బ్లాక్ వద్ద వరద ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోగా..…
అమెరికాలో కరోనా కేసులు తగ్గినట్టుగానే తగ్గి తిరిగి భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఆ దేశంలో లక్ష వరకు కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఒకవైపు కరోనా కేసులతో అతలాకుతలం అవుతుంటే, ఇప్పుడు భారీ వర్షాలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. హరికేన్ ఇదా దెబ్బకు దేశం విలవిలలాడిపోతున్నది. న్యూయార్క్‌లో ఎప్పడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ప్రమాదకరమైన స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. రోడ్లన్ని సెలయేరులా మారిపోవడంతో ఎమర్జెన్నీని విధించారు.…