కొత్త ఏడాదిని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. జోహన్నెస్ బర్గ్ టెస్టులో గెలిచి తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ సాధిస్తుందన్న అభిమానుల ఆశలను టీమిండియా తలకిందులు చేసింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టు… రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 300 పరుగులు చేయకపోవడం నిరాశ కలిగించే విషయమే. దీంతో తొలిసారిగా వాండరర్స్ స్టేడియంలో టీమిండియా ఓటమి పాలయ్యింది. ఈ టెస్టు ముందు వరకు వాండరర్స్ స్టేడియంలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.…
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు గోవాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. గోవా పర్యాటక రాష్ట్రం కావడంతో అక్కడ సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. అయితే, గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తుండటంతో వేడుకలకు దూరంగా ఉన్నారు. డిసెంబర్‌లో ఒమిక్రాన్ వేరియంట్, కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజలు వాటిని పట్టించుకోకుండా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు పెద్ద ఎత్తున గోవా చేరుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. వరసగా సెలవులు రావడంతో టూరిస్టులు పోటెత్తారు.…
కొత్త సంవత్సరం వేళ ఫుడ్ డెలివరీ యాప్‌లు భారీగా లాభాలు ఆర్జించాయి. సరికొత్త రికార్డుసు సృష్టించాయి. దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లైన స్విగ్గి, జోమాటోలు సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాయి. డిసెంబర్ 31 వ తేదీన స్విగ్గిలో ప్రతి నిమిషానికి 9 వేల ఆర్డర్లు బుక్ చేయగా, జొమాటోలో నిమిషానికి 8 వేల ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొన్నది. గతేడాది డిసెంబర్ 31 వ స్విగ్గిలో నిమిషానికి 5,500 ఆర్డర్లు రాగా, ఆ రికార్డును స్విగ్గి ఈ…
సంగారెడ్డి జిల్లాలో కొత్త సంవత్సరం రోజు విషాదం నెలకొంది. జహీరాబాద్ మండలం డిడ్గి వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు అమాంతం అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులతో సహా 8 ఏళ్ల చిన్నారి మృతి చెందారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతులను…
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో లిక్కర్ అమ్మాకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలియజేసింది. ఈరోజు బిల్లింగ్ క్లోజ్ వరకు సుమారు 40 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. 34 లక్షల కేసుల బీర్లు అమ్మాకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలియజేసింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 3,350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణ చరిత్రలోనే ఇది రికార్డ్ అని, ఈ స్థాయిలో లిక్కర్ సేల్ జరగడం ఇదే…
ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరం వేడుకలు మొదట న్యూజిలాండ్‌లో ప్రారంభం అయ్యాయి. న్యూజిలాండ్ రాజధాని అక్లాండ్‌లో కొత్త సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టాలని, మళ్లీ పూర్వం రోజులు రావాలని, ప్రపంచంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని ప్రజలు కోరుకుంటూ సంబరాలు చేసుకున్నారు. Read: విమానంలో ప్రయాణం చేస్తున్న మహిళకు కరోనా……
నూతన సంవత్సర వేడుకలకు అంతా సిద్ధమవుతున్న సమయంలో.. మంద్య షాపులు, బార్లకు కాస్త వెలసుబాటు కల్పిస్తూ.. మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మద్యం విక్రయాల సమయం గంట సేపు పొడిగించింది.. రాష్ట్రంలోని బార్లు, రీటైల్ మద్యం దుకాణాలు, ఇన్ హౌస్సులో మద్యం విక్రయాల సమయంలో వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… డిసెంబర్ 31 అర్ధరాత్రిలో మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.. ఈవెంట్స్ తో పాటు పర్యాటక లైసెన్సులు కలిగిన హోటళ్లల్లో…
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం… డిసెంబర్ 31వ తేదీతో పాటు, జనవరి 1న కూడా బార్లు, వైన్ షాపులు, స్పెషల్ ఈవెంట్లకు ప్రత్యేక అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.. ఇక, డిసెంబర్ 31న వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉండనున్నాయి.. బార్స్, ఈవెంట్స్,…
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు బాబులకు కిక్కే న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… డిసెంబర్ 31వ తేదీతో పాటు, జనవరి 1న కూడా బార్లు, వైన్ షాపులు, స్పెషల్ ఈవెంట్లకు ప్రత్యేక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్… డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.. ఇక, డిసెంబర్ 31న వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే…
కరోనా కారణంగా చాలా దేశాల్లో 2020, 2021 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు. 2022 నూతన సంవత్సర వేడుకలను ధూమ్ ధామ్‌గా నిర్వహించాలని అనుకున్నా… కుదిరేలా కనిపించడంలేదు. ఒమిక్రాన్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాల్లో ఆంక్షలు విధించారు. యూరప్, అమెరికా దేశాల్లో వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కానీ, ఈసారి కూడా వారికి నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. ఇక కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరం రోజున కొన్ని…