క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు గోవాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. గోవా పర్యాటక రాష్ట్రం కావడంతో అక్కడ సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. అయితే, గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తుండటంతో వేడుకలకు దూరంగా ఉన్నారు. డిసెంబర్‌లో ఒమిక్రాన్ వేరియంట్, కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజలు వాటిని పట్టించుకోకుండా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు పెద్ద ఎత్తున గోవా చేరుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. వరసగా సెలవులు రావడంతో టూరిస్టులు పోటెత్తారు. గోవాలోని బీచ్‌లన్నీ టూరిస్టులతో కిటకిటలాడాయి. ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు.
Read: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు… కొత్తగా ఎన్నంటే…
కరోనా నిబంధనలు ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో టూరిస్టులు వేడుకల్లో పాల్గొనడంతో టెన్షన్ మొదలైంది. రోజు రోజుకు దేశంలో ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ ఎంటర్ అయిందని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రతిరోజూ 20 నుంచి 30 శాతం మేర కేసులు పెరుగుతుండటం ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పాలి. ఆంక్షలు అమలులో ఉన్న తరుణంలో ఇంతమంది టూరిస్టులకు ఎలా అనుమతులు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో గోవా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నది. టూరిజం పరంగా చాలా నష్టపోయింది.