తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకల పై ఆంక్షలు విధించింది కేసీఆర్ సర్కార్. హై కోర్టు ఆదేశాలతో ఆంక్షలు విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ్టి నుంచే జనవరి 2వ వరకు ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్. డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీ లు , బహిరంగ సభలు నిషేధిస్తూ… ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఓమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం… పబ్లిక్ ఈవెంట్స్…
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. డెల్టా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా, ఒమిక్రాన్ వ్యాప్తిని, తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దేశంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధించారు. మహారాష్ట్రలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంతల వరకు నేట్ కర్ఫ్యూ ను అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలోనే అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు, డెల్టా కేసులు నమోదవుతున్నాయి. హర్యానా, గుజరాత్‌లో రాత్రి 11 గంటల…
పన్ను చెల్లింపుల విషయంలో కేంద్రం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నది. జనవరి 1, 2022 నుంచి ఈ నిబంధనలు అమలుకాబోతున్నాయి. ఆర్థిక చట్టం 2021లో భాగంగా సవరణలు చేస్తున్నారు. దీంతో పరోక్ష పన్ను విధానం మరింత కఠినం కాబోతున్నాయి. వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లకు పైన ఉన్న కంపెనీ జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 3బీ దాఖలు చేయాల్సి ఉంటుంది. జీఎస్టీఆర్ 1 అనేది సేల్స్ ఇన్వాయిస్ చూపించే రిటర్న్, జీఎస్టీఆర్ 3బీ అనేది…
కరోనా పుణ్యమా అని వరుసగా మూడో ఏడాది కూడా ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని రిపోర్టులు అందుతున్నాయి. ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆఫీసులు ఓపెన్ చేయనున్నట్లు ఐటీ ఉద్యోగులకు సమాచారం అందాయి. కానీ ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దీంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు తీసుకొచ్చే విషయంపై పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని టాప్ ఎంఎన్‌సీ కంపెనీలు అధికారికంగా…
2022 ఏడాది రాకముందే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కొత్త ఏడాదిలో సిమెంట్ ధర మరింత పెరగనుంది. ప్రస్తుతం రూ.385 వరకు పలుకుతున్న 50 కిలోల సిమెంట్ బస్తా ధర మరో రూ.20 పెరగనుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇదే జరిగితే గతంలో ఎన్నడూ లేని విధంగా బస్తా సిమెంట్ ధర రూ.400 దాటనుంది. సిమెంట్ తయారీ ధరలో ప్రధాన ముడి పదార్థాలైన బొగ్గు, పెట్‌కోక్‌ల ధరలు ఇటీవల విపరీతంగా పెరగడంతో త్వరలో సిమెంట్ బస్తాల ధరలు…
గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రపంచంలోని 70 శాతం మంది జనాభా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ప్రపంచం మెల్లిగా బయటపడుతున్నది. కొన్ని దేశాల్లో మినహా చాలా చోట్ల కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది. అత్యధిక జనాభా కలిగిన ఇండియాలో సైతం కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది. వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడమే ఇందుకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. కరోనా కంట్రోల్‌లోకి రావడంతో ఇప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన ప్రజలు క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను పెద్ద…