దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రిత్వ శాఖలఅడ్రస్ లో మారిపోనున్నాయి.. పాత భవనాలను వదిలేసి కొత్త బిల్డంగ్స్ లోకి మారనున్నాయి మంత్రుల ఆఫీసులు.. కేంద్ర ప్రభుత్వానికి కొత్త సచివాలయం రెఢీ అయింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా టాటా సంస్థ కొత్త పార్లమెంట్ తో పాటూ సచివాలయాన్ని నిర్మించింద.. ఇప్పటికే పార్లమెంట్ ప్రారంభం పూర్తవగా ఆగస్ట్ 6 న కేంద్ర ప్రభుత్వ సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ ల మధ్యలో ఉన్న…
కొత్త పార్లమెంట్‌లో వాటర్ లీకేజీపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్‌ను ఇటీవలే ప్రధాని మోడీ ప్రారంభించారు.
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాజకీయ, క్రీడా, సినీ తారలు సందర్శిస్తున్నారు.. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు పార్లమెంట్ కు వచ్చారు.. తాజాగా మహిళా తారలు కొంతమంది పార్లమెంట్ ను సందర్శించి, మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.. పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో వారి పేర్లు ఉండటంతో పలువురు నటులు పార్లమెంటుకు వచ్చారు.. మోదీ మహిళల అభివృద్ధికి తీసుకొస్తున్న పథకాల గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ మరియు అతని ప్రభుత్వ చర్యను అభినందించారు. పార్లమెంట్ కు…
Women’s Reservation Bill: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ సి అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి, పలువురు మహిళలు పాలాభిషేకం నిర్వహించారు.
కొత్త పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు ఎంపి నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రేపటి(మంగళవారం) నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో కొనసాగనున్నాయి. అయితే రేపటి నుంచి ఎంపీలు కొత్త పార్లమెంట్‌కు మారనున్నారు. అక్కడ ఎంపీలు మాట్లాడే మైక్‌లన్నీ ఆటోమేటెడ్ సిస్టమ్‌తో పని చేస్తాయని సమాచారం.
Special Parliament session: కేంద్రం సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లోనే కొత్త పార్లమెంట్ కు సభ తరలివెళ్లనుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బంది, ఉద్యోగులకు ప్రత్యేక యూనిఫాం ధరించనున్నారు. పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా ఈ డ్రెస్ కోడ్ ఉండనుంది. నెహ్రూ జాకెట్స్, ఖకీ ప్యాంట్స్ ఇలా యూనిఫాంలో పలు మార్పులు రానున్నాయి. సెప్టెంబర్ 18న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతుండగా.. 19న వినాయక చతుర్థి రోజున కొత్త పార్లమెంొట్…
New Parliament: కేంద్రం ఈ నెల 18-22 వరకు 5 రోజలు పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే ఈ నెల 19న కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది.
S Jaishankar: కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్’ చిత్రంపై పాకిస్తాన్ ప్రేలాపనను తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్. దీనిపై పాకిస్తాన్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. అవిభాజ్య భారతదేశం చిత్రాన్ని, అశోక సామ్రాజ్యాన్ని, బాధ్యతయుతమైన, ప్రజా ఆధారిత పాలనను ఇది చూపుతుందని, అర్థం చేసుకునే శక్తి పాకిస్తాన్ కు లేదని అందుకే దాన్ని అర్థం చేసుకోలేకపోతోందని విమర్శించారు.
Asaduddin Owaisi: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్మానించకుండా ప్రధాని పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ఏంటని..? ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ కార్యక్రమాన్ని 20కి పైగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, జేడీయూ, శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, ఆప్, ఆర్జేడీ పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి.