దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రిత్వ శాఖలఅడ్రస్ లో మారిపోనున్నాయి.. పాత భవనాలను వదిలేసి కొత్త బిల్డంగ్స్ లోకి మారనున్నాయి మంత్రుల ఆఫీసులు.. కేంద్ర ప్రభుత్వానికి కొత్త సచివాలయం రెఢీ అయింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా టాటా సంస్థ కొత్త పార్లమెంట్ తో పాటూ సచివాలయాన్ని నిర్మించింద.. ఇప్పటికే పార్లమెంట్ ప్రారంభం పూర్తవగా ఆగస్ట్ 6 న కేంద్ర ప్రభుత్వ సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ ల మధ్యలో ఉన్న కర్తవ్యపథ్ కు పక్కనే నిర్మించిన సచివాలయానికి కర్తవ్య భవన్ గా నామకరణం చేశారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖలన్ని 1950, 1970ల మధ్య నిర్మించిన శాస్త్రి భవన్, కృషి భవన్, ఉద్యోగ్ భవన్ , నిర్మాణ్ భవన్ లలో ఉన్నాయి. వాస్తవానికి ఇపుడు ఈ నిర్మాణాలన్ని పాతబడ్డాయి.. కొన్ని భవానాలకు పెచ్చులూడుతున్నాయి.. మంత్రులు, మంత్రిత్వశాఖలు ఇబ్బంధులు పడ్తున్నాయి.. అంతేకాదు అక్కడక్కడ వేర్వేరుగా భిల్డింగ్స్ ఉండడంతో మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం సైతం గందరగోళంగా ఉంది. పైగా పార్కింగ్ సమస్యలు కూడా ఉన్నాయి. మొత్తానికి అన్ని సమస్యలకు చెక్ పెడ్తూ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం మొదలైది.. అందులో మొదట కర్తవ్య భవన్ అందుభాటులోకి రానుంది.
భారిగా నిర్మించిన భవనాల్లో మొత్తం లెటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించారు.. కర్తవ్య భవన్ లో కేంద్రమంత్రుల చాంబర్స్ తో పాటూ, ఆయా శాఖా కార్యాలయాలుండనున్నాయి.. కర్తవ్య భవన్ లో జీరో-డిశ్చార్జ్ వ్యర్థాల నిర్వహణ, ఇన్-హౌస్ ఘన వ్యర్థాల ప్రాసెసింగ్, రీసైకిల్ చేసిన నిర్మాణ సామగ్రిని విస్తృతంగా ఉపయోగిచారు..
సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగ ప్రభుత్వ విస్తృత పరిపాలనా సంస్కరణల ఎజెండాను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలను అమలు చేయడం వల్ల, సెంట్రల్ సెక్రటేరియట్ అంతర్-మంత్రిత్వ సమన్వయానికి దోహదం జరగనుంది.
సెంట్రల్ సెక్రటేరియేట్ నిర్మాణంలో కొత్త ట్రెండ్ ను ఫాలో అయింది కేంద్రం. నూతన భవనాల్లో రెండు బేస్‌మెంట్‌లు, ఏడు అంతస్తులలో అంటే గ్రౌండ్ + 6 అంతస్తులు మోడల్ లో నిర్మించారు.. హోం వ్యవహారాలు, విదేశాంగ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, MSME, DoPT, పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖలు వాట విభాగాలకు కార్యాలయాలను కేటాయించారు..
ఇక నూతన సెక్రటేియేట్ లోకి ఎంట్రీ అంత సులువు కాదు.. ID కార్డ్ ఆధారిత యాక్సెస్ నియంత్రణలు, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ నిఘా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సిస్టం లను ఏర్పాటు చేశారు.. రూఫ్‌టాప్ సోలార్, సోలార్ వాటర్ హీటింగ్, వర్షపునీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు.. ఇ-వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.