AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోపే ప్రభుత్వానికి నివేదికని ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకొనుంది. అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రెండు మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం ఉందని సమాచారం. వైస్సార్సీపీ హాయాంలో పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే, ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని…
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది.. కొత్త జిల్లాల మార్పుకు సంబంధించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. కొన్ని జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుండగా.. స్వరూపం మార్చుకోనున్నాయి కొన్ని జిల్లాలు... జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది..
కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, అవసరమైన చోట తహసీల్దారు కార్యాలయాలను నిర్మిస్తాం అని తెలిపారు రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ రోజు శాసనసభలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ ఆఫీసులు, అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తాం అన్నారు..
డివిజనల్ హెడ్‌క్వార్టర్‌కు దూరంగా నివసించే ప్రజల అవసరాలను తీర్చడానికి 19 కొత్త జిల్లాలు, మరో మూడు డివిజనల్ హెడ్‌క్వార్టర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు.
శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టేందుకు కెబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అమ్మ ఒడి నిధుల విడుదలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని.. ఈనెల 27న అమ్మ ఒడి పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారని తెలిపారు. అటు క్రీడాకారిణి జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఆక్వా…
ఏపీలో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. అయితే సంక్షేమ పథకాలు పొందడానికి ఆధార్ కార్డులను అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో పాత జిల్లా పేర్ల స్థానంలో కొత్త జిల్లా పేర్లను చేర్చే విషయంపై అధీకృత సంస్థతో చర్చిస్తున్నామని ఏపీ సీసీఎల్‌ఏ కార్యదర్శి బాబు వివరించారు. ఆధార్ కార్డులో చిరునామా మార్పుపై మంగళవారం సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆధార్ కార్డులో మార్పు చేర్పులకు సంబంధించి పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. మండలం,…
ఏపీలో ఇటీవల ప్రభుత్వం 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలతో కలిపి ఏపీలో జిల్లాల సంఖ్య 26కి చేరింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) కోడ్‌లను కేటాయించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749,…
ఏపీ కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు అమల్లోకి రాగా.. త్వరలో మరో కొత్త జిల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం జగన్ ఆలోచిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాంతాలన్నీ కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలతో కొత్త జిల్లా…
తెలుగుజాతి వెలుగు కిరణం ఎన్టీఆర్. అటు సినిమా, ఇటు రాజకీయరంగంలో ఎన్టీఆర్ అచంద్రతారార్కం అయిన చరిత్ర. ఏపీలో ఇవాళ కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఎన్టీఆర్ జిల్లా సగర్వంగా ఆవిష్కృతం అయింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీ రావు.ఆయన్ని అభినందించారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెలుగు అకాడెమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి, ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి, విజయవాడ సీపీ కాంతి రాణా టాటా. ఎన్టీఆర్ జిల్లా జిల్లా జేసీగా బాధ్యతలు…