AP New Districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నేడు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించడానికి ప్రభుత్వం నెల రోజుల పాటు గడువు ఇవ్వనుంది. ఈ సమయంలో సూచనలు, అభ్యంతరాలు అందిన తర్వాత మంత్రుల అనుమతితో తుది నివేదిక ఆన్‌లైన్ ద్వారా ఆమోదం పొందే ఛాన్స్ ఉంది.
Read Also: Lalu Family Trouble: లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి వరుస షాకులు..
అయితే, కొత్త జిల్లాలకు ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. కొత్తగా మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీలో 26 నుంచి 29కి జిల్లాల సంఖ్య పెరగనుది. ఇక, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు విలీనం కానున్నాయి. అలాగే, తూర్పు గోదావరిలోకి మండపేట నియోజకవర్గం, వాసవి పెనుగొండ మండలంగా మారనున్న పెనుగొండ.. మరోవైపు, ఆదోని మండలంలోని పెద్ద హరివనం కొత్త మండలంగా ఏర్పాటు కానుంది.