ఏపీలో నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 13 జిల్లాలు ఆవిర్భావం కానున్నాయి. ఈ మేరకు 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొత్త జిల్లాలకు మహనీయుల పేర్లు పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 26 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. 15 కొత్త రెవెన్యూ…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది.. ఇప్పటికే దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది.. ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా.. ఆ సంఖ్య రెట్టింపు కాబోతోంది.. అంటే కొత్తగా 13 జిల్లాలు ఏర్పడి.. మొత్తంగా జిల్లాల సంఖ్య 26కు చేరుకోబోతోంది.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.. 26 జిల్లాల ప్రతిపాదనల నివేదికను సీఎస్‌కు అందజేశారు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్.. ఆ తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక,…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోందా? ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాల ఏర్పాటు పై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఒకటిరెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం. ప్రతి లోక్‌సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన వైసీపీ హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసిన…
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కేబినెట్.. సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని.. అందుకు సరికొత్త పోస్టుల అవసరం…