Insta Reel: ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. నగరంలో రద్దీగా ఉండే ఫ్లై ఓవర్‌పై కారును ఆపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించాడు.
Bharat Mobility Global Expo 2024: ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024ని సందర్శించి, భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఈవెంట్‌ని నిర్వహించిన ఆటోమొబైల్ పరిశ్రమను ప్రధాని అభినందించారు. ఎక్స్‌పోని పలు స్టాల్స్ తనని ఆకట్టుకున్నాయని, అయితే తాను పూర్తిగా అన్ని స్టాల్స్‌ని చూడలేకపోయానని అన్నారు. తాను ఎప్పుడూ కార్ కొనలేదని, చివరకు సైకిల్ కూడా కొనలేదని ప్రధాని అన్నారు.
Flat Sizes: దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు మంచి గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా లగ్జరీ ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. భారతదేశంలోని టాప్-7 నగరాల్లో సగటున ‘ఫ్లాట్ సైజ్’ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 11 శాతం పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్, కోల్‌కతా రెండు నగరాల్లోనే ఫ్లాట్ సైజ్ తగ్గింది.
Delhi: నూతన సంవత్సర వేడుకలకు ముందు ఢిల్లీ పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న సరిహద్దులు, ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
ఏపీ విభజన చట్టంలోని అంశాలు- అమలుపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇవాళ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, విద్యా సంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, 13వ షెడ్యూల్ అనుసరించి ఆస్తుల విభజన తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ సాయంత్రం న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కిషన్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారు.
Afghanistan: భారతదేశంలో ఆఫ్ఘానిస్తాన్ తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. న్యూఢిల్లీలో ఆఫ్గాన్ ఎంబసీ మూసివేసింది. గత కొన్ని నెలలుగా భారత్ లో ఆఫ్ఘాన్ రాయబారి లేరు. ఢిల్లీలోని ఆఫ్ఘాన్ దౌత్యవేత్తలు కూడా యూకే, అమెరికా వెళ్లి ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత్ లో ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయం అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ముగ్గురు రాయబార కార్యాలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు పదవ తరగతి బాలుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఒక్కరు కాదు ఏకంగా నలుగురు కలిసి ఆ మైనర్ బాలుడిని తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. చాలా రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. Also Read: Red Rice Benefits: రెడ్ రైస్ ను రోజూ ఒక కప్పు తీసుకుంటే ఎన్ని…
MotoGP: మోటార్ సైకిల్ రోడ్ రేసింగ్ ఈవెంట్లకు ప్రసిద్ధి చెందిన MotoGP భారత మ్యాపును తప్పగా చూపింది. ఉత్తర్ ప్రదేశ్ గ్రేటర్ నోయిడా బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో జరుగుతున్న ఇండియన్ ఆయిల్ గ్రాండ్ ఫ్రీక్స్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారంలో భారత మ్యాపును తప్పుగా చూపింది. దీంతో MotoGP చేసిన తప్పును నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఎత్తి చూపారు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.