Insta Reel: ఇన్‌స్టా రీల్ కోసం ఫ్లైఓవర్‌పై కారు ఆపాడు.. రూ.36,000 జరిమానా కట్టాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Insta Reel: నార్త్ ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ సమీపంలో ఫ్లైఓవర్‌పై ఓ వ్యక్తి ఓవర్ ఆక్ష్సన్ చేశాడు. దానికి స్పందించిన పోలీసులు అతనికి భారీ జరిమానా విధించి కారును సీజ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. నగరంలో రద్దీగా ఉండే ఫ్లై ఓవర్‌పై కారును ఆపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించాడు. దీంతో ఢిల్లీ పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.36,000 జరిమానా విధించారు. నిందితుడి పేరు ప్రదీప్ ఢాకా అని, పోలీసులపై దాడికి కూడా ప్రయత్నించాడని పోలీసులు వివరించారు.
నిందితుడు ప్రదీప్ కారును సీజ్ చేసి అతడిపై మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీ సమయంలో ఢిల్లీలోని పశ్చిమ్ విహార్‌లోని ఫ్లైఓవర్‌పై కారును ఆపి వీడియోలు చిత్రీకరించి, డోర్ తెరిచి కారును నడిపినట్లు పోలీసులు తెలిపారు. అంతటితో ఆగకుండా పోలీసుల బారికేడ్లకు నిప్పంటించి వీడియోలు తీశాడని వివరించారు. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించాడు. ప్రదీప్‌పై కేసు నమోదు చేయడానికి దారితీసిన వీడియోలను ఢిల్లీ పోలీసులు పంచుకున్నారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అతడిని అరెస్టు చేసినట్లు వివరించారు. ప్రదీప్ ఉపయోగించిన కారు అతని తల్లి పేరు మీద రిజిస్టర్ అయిందని, ఆ కారులో కొన్ని నకిలీ ప్లాస్టిక్ ఆయుధాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
Read also: Kadiyam Srihari: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య!
అసలేం జరిగిందంటే..
నార్త్ ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ సమీపంలోని ఫ్లైఓవర్‌పై ఫుల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇద్దరు యువకులు తమ కారును ఆపి లోపలికి లాగారు. ప్రదీప్ ఢాకా పోస్ట్ చేసిన వీడియోలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో యువత తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. పాపులారిటీ కోసం చేసే ఇలాంటి వారికి జైలుశిక్షతోపాటు వారి వాహనాలను సీజ్ చేయడంతోపాటు భారీ జరిమానా విధించాలని సూచించారు. దీనిపై వెంటనే స్పందించిన నార్త్ ఢిల్లీ పోలీసులు వారిని పట్టుకుని కేసు నమోదు చేసి, జరిమానా విధించారు.
रील बनाने के लिए विभिन्न यातायात प्रावधानों का उल्लंघन करने वाले आरोपी के विरुद्ध #दिल्लीपुलिस ने मोटर वाहन अधिनियम के अंतर्गत सख्त कार्यवाही करते हुए चालान कर वाहन ज़ब्त किया और पुलिसकर्मियों से अभद्रता एवं उनपर हमला करने पर आईपीसी की धाराओं में केस दर्ज कर गिरफ्तार किया। pic.twitter.com/2f5VBJrwtS
— Delhi Police (@DelhiPolice) March 30, 2024
Tillu Square: బాక్స్ ఆఫీసును షేక్ చేస్తున్న టిల్లు స్క్వేర్.. కలెక్షన్స్ ఎంతంటే..!
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!