తెలంగాణలో సీఎం ఎంపిక పూర్తైంది. ఇక, మంత్రివర్గం కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానం నజర్ పెట్టింది. ఏఐసీసీ నేతలు రేవంత్ రెడ్డితో చర్చించి మంత్రివర్గం ఖరారు చేయనున్నారు. అయితే, మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలి.. ఎవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలనే దానిపై రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం చర్చించే అవకాశం ఉంది.
ఏపీ సీఎం జగన్ మంత్రుల్ని జిల్లాలకు ఇన్ ఛార్జిలుగా నియమించాక.. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల జాబితాను మంగళవారం ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మీడియా ముఖంగా వెల్లడించారు. మంత్రులుగా అవకాశం ఇవ్వలేని వారికి జిల్లా అధ్యక్షులుగా నియమించారు. కొందరు మాజీ మంత్రులకు జిల్లా అధ్యక్షుల బాధ్యతలు అప్పగించారు. చోటు కల్పించ లేని ఆశావహులకూ జిల్లా అధ్యక్ష బాధ్యతల అప్పగించడం ద్వారా వారిలోని అసమ్మతిని తగ్గించే ప్రయత్నం చేసింది పార్టీ. 11…
ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం జరిగింది. సీఎం జగన్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఇన్‌ఛార్జ్ మంత్రిగా బొత్స సత్యనారాయణ, అనకాపల్లి ఇన్‌ఛార్జ్ మంత్రిగా పి.రాజన్నదొర, కాకినాడ ఇన్‌ఛార్జ్ మంత్రిగా సిదిరి అప్పలరాజు, పార్వతిపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రిగా గుడివాడ అమర్నాధ్, పశ్చిమగోదావరి ఇన్‌ఛార్జ్ మంత్రిగా దాడిశెట్టి రాజా,…
ఏపీలో కేబినెట్ ప్రక్షాళన అనంతరం కొన్నిచోట్ల అసంతృప్తులు బయటపడ్డాయి. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత అసహనంతో వున్నారని, ఆమె రాజీనామా చేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు సుచరిత. పార్టీ, సీఎం జగన్ ఎంతో గౌరవించి.. పదవులు కట్టబెట్టారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అన్నారు. కొంత మందిని తొలగిస్తామని.. కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని జగన్ చెప్పారు. మమ్మల్ని…
ఏపీ మంత్రివర్గ విస్తరణ విమర్శల పాలవుతోంది. ప్రతి పక్షాన్ని తిట్టేందుకేనా మంత్రులు వున్నదని తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్. ప్రజలకు పని చేయటం కోసం మంత్రి పదవులివ్వలేదన్నది కెబినెట్ చూస్తే అర్థమవుతోంది. ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కాలంటే అవినీతి, మాఫియా, భూకబ్జాలే అర్హతలు అన్నారు. Also Read: Atchannaidu: ఆక్వారంగాన్ని ఉరితీసిన జగన్ వైఎస్ కుటుంబాన్ని తిట్టిన వాళ్లకూ మంత్రివర్గంలో చోటు కల్పించారు. వైఎస్ దోపిడీని బయటపెట్టడం లేదా కలిసి దోపిడీ…
ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అధికార పార్టీని అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ విషయం పార్టీని కుదిపేస్తోంది. అంతా బాగానే వుందని చెబుతున్నా.. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు నేతలు. నిన్నటి వరకు మాకు ఒక్కడే నాయకుడు అని డప్పులు కొట్టుకున్న పాలకపక్షం నేతలు ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని కామెంట్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఒకే మాట ఒకే బాట అన్న నాయకులు నేడు పదవులకు ఏడుపులు, పెడబెబ్బలు…
ఏపీలో జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. పాతకొత్త కలయికతో మంత్రులు కొలువుదీరారు. అవినీతిలో కూరుకున్న వారిని కేబినెట్ లోకి తీసుకున్నారని, జగన్ కేబినెట్ లో మంత్రులకు పవర్ ఉందా ? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సీఎం జగన్ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలరా? బీసీలను ముఖ్యమంత్రిని చేసి జగన్ డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు కదా అన్నారు. 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లకు టేబుల్ – కుర్చీలైనా ఉన్నాయా? అని సోము…
జగన్ మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. 25 మంది మంత్రులతో జగన్ కేబినెట్ కొలువుదీరింది. అయితే, ఆశించిన మంత్రిపదవి రాకపోవడంతో కొంతమంది ఎమ్మెల్యేలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే తనకు మంత్రి పదవి రాలేదంటూ కామెంట్లు చేయడం విశేషం. సీఎం జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంది. నామినేటెడ్ పదవులు పొంది.. సీఎం క్యాంప్ ఆఫీస్…
సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఏమీ లేదు. జాబితా సాయంత్రం తర్వాత విడుదల అవుతుందన్నారు సజ్జల. సీఎంతో మరో భేటీ ఏమీ లేదు. రాత్రి ఏడు గంటలకు రాజ్ భవన్‌కు జాబితా పంపిస్తాం అని చెప్పారు. మంత్రుల జాబితా ఫైనల్ లిస్ట్ సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.
ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుందని వస్తున్న వార్తలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ రెండున్నరేళ్లకు ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారని, త్వరలోనే కెబినెట్ రీ-షఫుల్ ఉండే అవకాశం వుందన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ మాకు కీలకమే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అవసరాన్ని బట్టి మంత్రులుగా ఉండే వాళ్ళను పార్టీకి వినియోగించుకుంటాం అన్నారు. చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నాడు. ముందస్తుకు…