నేపాల్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. మనం మిత్రదేశంగా భావిస్తున్నప్పటికీ.. భారత భూభాగాలపై ఎప్పటికప్పుడు పేచీ పెడుతూనే ఉంది. గతంలో ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలీ చైనాకు మద్దతుగా ఉండీ.. భారత్ భూభాగాలైన లిపులేక్, లింఫియాధురా, కాలాపానీ ప్రాంతాలను తమ దేశానికి చెందినవిగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి నేపాల్ ఈ మూడు ప్రాంతాలపై పార్లమెంట్ లో చర్చించింది. ఈ మూడు ప్రాంతాలపై నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కీలక ప్రకటన చేశారు. ఈ…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ… నేపాల్‌లో వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. ఆ దేశ రాజధాని ఖాట్మండులో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. మయన్మార్ నేపాల్ దౌత్యవేత్తగా పనిచేసిన భీమ్ ఉదాస్.. తన కుమార్తె మ్యారేజ్‌కు రాహుల్‌ను ఆహ్వానించగా.. ఆయన అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఖాట్మాండులోని నైట్‌క్లబ్‌లో రాహుల్ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నిజానికి ఈ వీడియోను వైరల్‌గా మార్చింది బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూరప్ పర్యటనపై రాహుల్‌గాంధీ విమర్శలు…
ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు నివశిస్తున్నారు. ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్తుంటారు. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని జైళ్లలో ఎంతమంది భారతీయులు ఉన్నారు అనే దానిపై భారత విదేశాంగ సహాయమంత్రి వీ మురళీధరన్ పార్లమెంట్‌లో వివరణ ఇచ్చారు. విదేశీ జైళ్లలో 7925 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. యూఏఈ జైళ్లలో 1663 మంది భారతీయులు ఖైదీలుగా ఉండగా, సౌదీ అరేబియాలో 1363…
చైనా చుట్టుపక్కల దేశాలపై కన్నేసింది. 2025 నాటికి తైవాన్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలని చైనా చూస్తున్నది. దీనికోసం చాలా రోజులుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇటు ఇండియాలోని లద్ధాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌పై కూడా చైనా కన్నేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నది. బోర్డర్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ఆ దేశం సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. అదీ చాలదన్నట్టు ఇప్పుడు మరో మిత్రదేశం నేపాల్‌పై కూడా చైనా కన్నేసింది. నేపాల్ చైనా మధ్య సుమారు 1400 కిమీ మేర సరిహద్దు…
ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. దీనిని ప్రతి ఏడాది పదుల సంఖ్యలో పర్వతారోహకులు అధిరోహిస్తుంటారు. చాలా మంది ఈ మంచుపర్వతం సానువులను సందర్శిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఈ మంచుశిఖరంపై శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2వేల సంవత్సరాలలో ఏర్పడిన మంచు కేవలం 25 ఏళ్లలో కరిగిపోయింది. మంచు ఏర్పడటానికి పట్టిన సమయం కన్నా 80 రెట్లు వేగంగా మంచు కరిగిపోతున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబందించిన విషయాలను నేచర్ క్లైమేట్ జర్నల్ లో పేర్కొన్నారు.…
సాధారణంగా రోడ్డుపై వెళ్లే బైక్, కారు, ఇతర వాహనాలకు పంక్చర్లు అవుతుంటాయి. అలా జరిగినపుడు అవసరమైతే తోసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అదే ఆకాశంలో ప్రయాణం చేసే విమానం టైర్‌కు పంక్చరైతే ఏంచేయాలి. రన్‌వే మీదున్న విమానం ముందుకు కదలాలి అంటే తప్పనిసరిగా టైర్లు ఉండాల్సిందే. పంక్చరైతే కనీసం కొంచెం కూడా ముందుకు కదలని పరిస్థితి వస్తుంది. దీంతో చేసేదిలేక విమానంలోని ప్రయాణికులంతా దిగి తలోచేయి వేసి ముందుకు తోశారు. Read: లైవ్: రోశయ్యకు ఘన నివాళి……
UN-మద్దతుగల COVAX గ్లోబల్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కింద 50 లక్షల డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్ లకు ఎగుమతి చేయడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ మూడు దేశాలతో పాటు, SII COVAX కింద కోవిషీల్డ్‌ను బంగ్లాదేశ్‌కు కూడా ఎగుమతి చేయనున్నట్టు వారు తెలిపారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) నవంబర్ 23 నుంచి COVAX ప్రోగ్రామ్ కింద కోవిడ్…
నేపాల్‌లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. దసరా సందర్భంగా వలస కార్మికులు నేపాల్‌లోని గంజ్ నుంచి ముగు జిల్లాలోని గామ్‌గధికి వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి తీవ్రంగా ఉన్నది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. బస్సు ఛాయనాథ్ రారా పట్టణాన్ని దాటగానే అదుపు తప్పి 300 అడుగుల లోతున్న లోయలో పడింది. దీంతో బస్సు…
వేద కాలంలో భారత్‌లోనే ఉన్న యోగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.. శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది.. కరోనా మహమ్మారి సృష్టించిన విలయంతో అందరి దృష్టి వ్యాయామం, యోగా సాధనపై పడిపోయింది.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోన్న సమయంలో.. యోగా పుట్టుకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేవారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి.. భారత్‌లో యోగా పుట్టలేదన్న ఆయన.. నేపాల్‌లోనే యోగా పుట్టిందని చెప్పుకొచ్చారు.. భారత్ ఓ దేశంగా ఉనికిలోకి రాకముందే నేపాల్…
నేపాల్ పై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనాలో తయారైనా సీనోఫామ్ వ్యాక్సిన్లను నేపాల్‌లో వేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ విషయంలో రెండు దేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ ధరను బహిర్గతం చేయకూడదు. కానీ, సీనోఫామ్ వ్యాక్సిన్ టీకా ధరను కొన్ని మీడియా సంస్థలు బహిర్గతం చేయడంతో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరల విషయం బహిర్గతం కావడానికి కారకులపై చర్యలు తీసుకోవడానికి నేపాల్ ప్రభుత్వం సిద్ధం అయింది. ఒక్కో…