నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరగినట్లు తెలుస్తోంది. తారా ఎయిర్ కు సంబంధించిన విమానం ఆదివారం ఉదయం 9.55 గంటలకు గ్రౌండ్ స్టేషన్, ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. ఎంత ప్రయత్నించినా విమానంతో కమ్యూనికేషన్ కలవలేదు. పోఖారా నుంచి జోమ్ సోమ్ కు విమానం వెళ్తున్న క్రమంలో సంబంధాలు కోల్పోయింది.
కనిపించకుండా పోయిన తారా ఎయిర్ విమానానికి 9 ఎన్ఏఈటీ జంట ఇంజన్లు కలిగినదిగా అధికారులు చెబుతున్నారు. మొత్తం విమానంలో 19 మందితో పాటు విమాన సిబ్బందితో కలిపి మొత్తం 22 మంది ఉన్నారు. విమానంలో నలుగురు భారతీయులతో పాటు ముగ్గురు జపాన్ జాతీయులు, మిగిలిన వారంతా నేపాల్ దేశానికి చెందిన వారిగా అధికారులు వెల్లడించారు.
కాగా విమానం ముస్తాంగ్ జిల్లాలోని జోమ్ సోమ్ ప్రాంతంలో ఆకాశంలో కనిపించిందని.. ఆ తరువాత ధౌలగిరి శిఖరం వైపు మళ్లించబడిందని.. ఆ తరువాత విమానంతో సంబంధాలు కోల్పోయని తెలుస్తోంది.జోమ్ సన్ ఎయిర్ పోర్ట్ ఏటీసీ ప్రకారం ఘసా ఆఫ్ జామ్సన్ లో పెద్ద శబ్ధం వినిపించిందని తెలుస్తోంది. రాడార్ నివేదిక ప్రకారం విమానం చివరి సారిగా సంబంధాలు కోల్పోయిన ప్రాంతానికి హెలికాప్టర్ ను పంపించారు. విమానం కోసం సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించారు నేపాల్ అధికారులు. సెర్చ్ ఆపరేషన్ కోసం రెండు ప్రైవేటు హెలికాప్టర్ తో పాటు ఆర్మీ చాపర్ తో గాలింపు చేపడుతున్నారు.