నవంబరు 20న జరగనున్న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండపై పోటీ చేసి, హిమాలయ దేశాన్ని మళ్లీ హిందూ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో శతాధిక స్వాతంత్ర్య సమరయోధుడైన టికా దత్తా పోఖారెల్ పోటీలో ఉన్నారు.
ఆకలి సూచీలో భారత్ అట్టడుగు స్థానానికి పడిపోయింది. భారతదేశం 121 దేశాలతో విడుదల చేసిన జాబితాలో 2021లో 101 స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 107వ స్థానానికి పడిపోయింది.
Nepal : నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెను ఆ దేశ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. విద్యదేవి భండారీ శుక్రవారం నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు.. శనివారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రికి తరలించినట్లు తన పర్సనల్ సెక్రెటరీ భేష్ రాజ్ అధికారి తెలిపారు. Read Also: Diwali: దీపావళి పండుగపై అయోమయం.. ఈ నెల 24న లేదా 25..? ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు అన్ని రకాల వైద్య…
Bus falls into river in Nepal: నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల కాలంలో వరసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం నేపాల్ లోని బారా జిల్లాలోని బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నేపాల్ లోని మాధేష్ ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది. మరో 35 మంది గాయపడ్డారు. వీరిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
17 people Killed heavy rains and Landslides in Nepal: హిమాలయ దేశం నేపాల్ ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా పడుతున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో కొండచరియాలు విరిగిపడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి నేపాల్ వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో వానల కారణంగా దేశంలో 17 మంది మరణించారని అక్కడి అధికారులు శనివారం వెల్లడించారు.
Earthquake Hits Nepal: నేపాల్ మరోసారి భూకంపానికి గురైంది. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ ర్త్క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం..నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 147 కిలోమీటర్ల దూరంలోని ఖోటాంగ్ జిల్లా మార్టిమ్ బిర్టా భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఆదివారం ఉదయం 8.13 గంటలకు భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. భూకంప కేంద్రం ఉపరితనం నుంచి 10…
పానీ పూరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..? అసలు ఆ పేరు ప్రస్తావిస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఇక ఎక్కడైన బండి కనిపిస్తే చాలు.. లగెత్తుకుని వెళ్లి పానీ పూరీ సేవించేస్తారు. ముఖ్యంగా.. సాయంత్రం వేళ్ల ప్రతిఒక్కరూ దీనిని ఎంతో ఇష్టంగా స్నాక్స్గా తీసుకుంటారు. అలాంటి పానీ పూరీని ఒక చోట బ్యాన్ చేసేశారు. అదే.. నేపాల్లోని ఖాట్మండు వ్యాలీలో! అక్కడ పానీ పూరీ అమ్మకాల్ని నిషేధిస్తున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకు ఓ…