హైదరాబాద్ ఐఎస్ సదన్ లోని చికోటి ప్రవీణ్ ఇంట్టో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కేసినో ఆడించడంలో చికోటి ప్రవీణ్ దిట్టగా పేరుపొందారు. గతంలో చికోటి ప్రవీణ్ పైన సిబిఐ కేసు నమోదు చేసింది. తాజాగా చికోటి ప్రవీణ్ ఇంటి ఫై ఈడీ దాడులు చేయడం సంచలనంగా మారింది. ఫెమా కింద కేసు నమోదు చేసిన ఈడీ.. హైదరాబాద్ లో మొత్తం 8 చోట్ల దాడులు చేస్తోంది. గతంలో గుడివాడ కేసినో కేసులో ఆరోపణలు ఎదురుకున్నారు ప్రవీణ్. కేసినో వ్యవహారం లో మాధవరెడ్డి ఇంటిఫై కూడా ఈడీ దాడులు చేస్తోంది.
గతంలో గుడివాడ కేసినో కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నాడు ప్రవీణ్. బోయిన పల్లిలో మాధవరెడ్డి ఇంటి ఫై ఈడీ సోదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. జూన్ 10, 11,12,13 తేదీలలో నేపాల్ లోని హోటల్ మేచీ క్రౌన్ లో కేసీనో నిర్శహించాడు మాధవ రెడ్డి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానాల ద్వారా నేపాల్ కు పేకాట రాయిళ్ళను తరలించినట్టు తెలుస్తోంది. ఇండో నేపాల్ సరిహద్దు సిలిగురిలో క్యాసినో శిబిరాలు నిర్వహిస్తున్నారు.
నేపాల్ , ఇండోనేషియా, పుక్కెట్ లో క్యాసినోలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. క్యాసినో లలో టాలివుడ్ , బాలీవుడ్ , నేపాలీ డ్యాన్సర్ల చిందులు వేస్తారు. ఫెమా కింద కేసు నమోదు చేసిన ఈడీ.. దాడులు చేస్తోంది. గతంలో బర్త్ డే పేరుతో ఖరీదైన పార్టీలు ఇచ్చిన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈడీ దాడుల్లో ఏమేం ఆధారాలు లభిస్తాయో చూడాలి మరి.
Fifty Five Years for Marapurani Katha : వాణిశ్రీని అభినేత్రిగా నిలిపిన ‘మరపురాని కథ’!