Nepal Ex-PM KP Sharma Oli: నేపాల్ మాజీ ప్రధాన మంత్రి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (UML) ఛైర్మన్ కేపీ శర్మ ఓలి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. పార్టీ విద్యార్థి విభాగం, రాష్ట్రీయ యువ సంఘ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన శనివారం భక్తపూర్ చేరుకున్నారు. భారీ నిరసనల నేపథ్యంలో సెప్టెంబర్ 9న ఓలి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారు. నిరసనల…
Nepal: నేపాల్‌లో నిరసనలు శాంతించాయని అనుకునే లోపే మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కార్కి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిల్లో జనరల్-జి నిరసనలో మరణించిన యువకుల కుటుంబాలకు నష్టపరిహారం, వారందరికీ అమరవీరుల హోదా ఇవ్వడం వంటివి ఉన్నాయి. అయినా ఈ కొత్త నిరసనలకు కారణాలు ఏంటి, నేపాలీలు ఎందుకు ఈ నిరసనలు చేస్తున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుందాం.. READ ALSO: తడి…
మన పొరుగు దేశమైన నేపాల్ ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉంది. దీనికి కారణం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం, దీనికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం జరుగుతోంది. ఇందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఈ సంఘటనపై తన బాధను వ్యక్తం చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా నేపాలీ భాషలో ‘ఆజ్‌కో దిన్ నేపాల్కా లాఘి కాలో దిన్ హో – జబ్ జంతకో…
Nepal Protest: నేపాల్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. సోషల్ మీడియాపై ప్రభుత్వం బ్యాన్ విధించడంతో ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా యువత ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తోంది. సోమవారం కాల్పుల్లో 19 మంది ఆందోళనకారులు చనిపోవడంతో, హింసాత్మక దాడులు పెరిగాయి. ఆగ్రహావేశాలకు గురైన ప్రజలు రాజకీయ నాయకులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. ప్రధాని కేపీ శర్మ ఓలి ఇంటితో పాటు అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలకు నిప్పుపెట్టారు. ఆర్థిక మంత్రిని వీధుల్లో తరుముతూ దాడి చేసిన వీడియో వైరల్‌గా…
Breaking News: సోషల్ మీడియా బ్యాన్‌తో నేపాల్‌లో ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. జెన్ జెడ్ యువత ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోమవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలి నివాసంతో పాటు అధ్యక్ష, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడి చేసి, నిప్పటించారు.
Balendra Shah: సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. జెన్-జీ యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన కాల్పుల్లో 19 మంది ఆందోళనకారులు మరణించడంతో, ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
Nepal Gen Z protests: నేపాల్‌లో సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో, జెన్-జీ యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. రాజధాని ఖాట్మాండుతో పాటు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు అంటుకున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సోమవారం 19 మంది ఆందోళనకారులు చనిపోయిన తర్వాత, హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ప్రధాని, అధ్యక్షుడు ఇళ్లతో పాటు సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలకు నిప్పుపెట్టారు.
Nepal Protest: సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా, నేపాల్‌లో యువత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ఆందోళన హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. సోమవారం, భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 20 మంది ఆందోళకారులు మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
Nepal Protest: గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.
Nepal Protests 2025: పొరుగు దేశం నేపాల్‌లో నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. వేలాది నేపాలీలు ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ దేశ పార్లమెంట్‌లోకి దూసుకొచ్చారు. నేపాల్ ప్రభుత్వం శుక్రవారం నుంచి దేశంలో అనేక సోషల్ మీడియా సైట్‌లను నిలిపి వేసింది. ప్రభుత్వ చర్యతో దేశంలోని ప్రజలు, కోపం, గందరగోళానికి గురయ్యారు. నేపాల్‌లో మిలియన్ల మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రసిద్ధమైన ప్లాట్‌ఫామ్‌లపై వినోదం, వార్తలు, వ్యాపారం కోసం ఆధారపడుతున్నారు. ఈక్రమంలో ప్రభుత్వం వాటిని అర్థాంతరంగా నిలిపివేయడంతో వేలాది…