Nepal: నేపాల్‌లో నిరసనలు శాంతించాయని అనుకునే లోపే మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కార్కి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిల్లో జనరల్-జి నిరసనలో మరణించిన యువకుల కుటుంబాలకు నష్టపరిహారం, వారందరికీ అమరవీరుల హోదా ఇవ్వడం వంటివి ఉన్నాయి. అయినా ఈ కొత్త నిరసనలకు కారణాలు ఏంటి, నేపాలీలు ఎందుకు ఈ నిరసనలు చేస్తున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుందాం..
READ ALSO: తడి నీలి చీరలో నభా నటేష్ గ్లామర్ మాయాజాలం
సంతోష పెట్టని ప్రధాని నిర్ణయాలు..
నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కార్కి అల్లర్లలో మరణించిన ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఇది మాత్రమే కాకుండా మరణించిన వారందరికీ అమరవీరుల హోదా ఇవ్వడానికి కూడా ఆమె అంగీకరించారు. అయితే తాత్కాలిక ప్రధాని నిర్ణయాలతో జనరల్-జి నిరసనకారుల కుటుంబాలు సంతోషంగా లేవు. దీంతో వాళ్లు ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నాకు దిగారు. ఇది మాత్రమే కాకుండా, వాళ్లు చనిపోయిన వాళ్ల పిల్లల మృతదేహాలను తీసుకోవడానికి కూడా నిరాకరించారు.
ఇటీవల నేపాల్‌లో జరిగిన నిరసనల్లో మృతుల సంఖ్య 72కి చేరుకుంది. మరణించిన వారిలో చాలా మంది మృతదేహాలను ఇప్పుడు వెలికితీస్తున్నట్లు నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిరసనల్లో షాపింగ్ మాల్స్, ఇళ్లు, ఇతర భవనాలకు నిప్పు పెట్టడం వంటివి జరిగాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకాష్ బుధతోకి పేర్కొన్నారు. ఈ దాడిలో కనీసం 2,113 మంది గాయపడినట్లు, అనేక ప్రభుత్వ భవనాలు, దేశ సుప్రీంకోర్టు, పార్లమెంట్ హౌస్, పోలీసు పోస్టులు, వాణిజ్య సంస్థలతో పాటు, దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ప్రధాన మంత్రి కె.పి.శర్మ ఓలితో సహా రాజకీయ నాయకుల ప్రైవేట్ ఇళ్లు ధ్వంసం అయ్యాయని తెలిపారు.
నిరసనకారుల కుటుంబాల డిమాండ్లు..
నిరసనకారుల అభిప్రాయం ప్రకారం తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కర్కి ఎంపికయ్యారు. కానీ ఇప్పటికీ వారి డిమాండ్లలో చాలా వరకు నెరవేరకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారు. ఖాట్మండు నుంచి వచ్చిన నివేదికల ప్రకారం.. సుశీలా కర్కి ఇంటి ముందు వందలాది మంది గుమిగూడారు. తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు, తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను తీసుకెళ్లబోమని వారు స్పష్టంగా చెప్పారు. అలాగే నిరసనల్లో గాయపడిన కుటుంబాలు వారు తమ హక్కుల కోసం పోరాడటానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంతకీ వాళ్ల డిమాండ్లు ఏంటంటే.. ముందు వాళ్లందరూ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కిని కలవడానికి ఎదురు చూశారు.
ఈసందర్భంగా బాధితుల్లో ఒకరి బంధువు కమల్ సుబేది మాట్లాడుతూ.. ప్రధానమంత్రితో మౌఖిక ఒప్పందం కుదిరిందని, కానీ ఇప్పటివరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ కాలేదని తెలిపారు. ఉత్తర్వులు జారీ అయ్యే వరకు తాము ఇక్కడి నుంచి వెళ్లబోవడం లేదని స్పష్టం చేశారు. నిరసనలో మరణించిన వారికి అమరవీరుల హోదా ఇవ్వాలి, అంత్యక్రియల సమయంలో రాష్ట్ర గౌరవాలు, బంధువులకు రాష్ట్ర కార్యదర్శి స్థాయిలో పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చూడాలి నేపాల్ తాత్కాలిక ప్రభుత్వం తాజా నిరసనలపై ఎలాంటి ప్రకటనలు జారీ చేస్తుంది అనేది. పలువురు విశ్లేషకులు మాట్లాడుతూ.. ఇప్పటికీ నేపాలీలలో కోపం పోలేదని, ప్రభుత్వం నిరసనకారులపై మంచి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
READ ALSO: PM Modi: కాంగ్రెస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంది: మోడీ