నెల్లూరు జిల్లాలో వెలుగు చూసిన సైబర్ క్రైమ్‌ను చూస్తే.. అసలు ఎవరు? నకిలీ ఎవరు? అనే అయోమయంలో పడిపోవాల్సిన పరిస్థితి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నారాయణ మెడికల్ కళాశాల డైరెక్టర్ పునీత్ పేరుతో నారాయణ సంస్థ ఆడిటర్ సురేష్ కుమార్‌ను మోసం చేశారు సైబర్ నేరగాళ్లు.. కొత్త వాట్సాప్ నెంబర్‌ను వాడుతున్నానని... నూతన ప్రాజెక్ట్ కోసం తాను పంపిన ఖాతా నంబర్‌కు రూ.కోటి 96 లక్షలు పంపాలని మెసేజ్ పెట్టారు జాదుగాళ్లు.. ఇక, అనుమానం రాకుండా.. వాట్సాప్…
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.. కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.. తనపై నమోదైన కేసుల విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు..
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ తవ్వకాలు.. ఖనిజం రవాణా.. పేలుడు పదార్థాల నిల్వకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి మూడో సారి నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు.
తెల్ల రాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు చేపట్టకుండా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.. ఈ కేసులో కాకాణి ఏ 4గా ఉన్నారు.. పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా.. కాకాణి సహకరించటం లేదని ప్రభుత్వం.. హైకోర్టుకి తెలియజేసింది..
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణీ గోవర్థన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈరోజు (ఏప్రిల్ 1న) నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ రేపటికి వాయిదా పడింది.. నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా నిన్న నోటీసులు జారీ చేశారు పోలీసులు.. ఆ నోటీసుల ప్రకారం.. ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. కాకాణి మాత్రం హాజరుకాలేదు.. ఆదివారం రోజు నెల్లూరులోని కాకాణి ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు.. ఈ రోజు హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి వెళ్లారు.. అక్కడ కూడా కాకాణి అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు..…
నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట హాజరుకావాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసుల నోటీసులు.. కాకాణి ఇంట్లో లేకపోవడంతో గేట్ కు నోటీసులు అంటించిన పోలీసులు.. అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా కాకాణి గోవర్థన్ రెడ్డిని చేర్చిన పోలీసులు..
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై.. పోలీసులు కేసు పెట్టారు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది.
Minister Narayana: నెల్లూరులో వివిద శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపుతో వ్యవహరించారు.. అందులో నేను కూడా బాధితుడినే అన్నారు. కానీ, ఇప్పుడు తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది చెప్పారు.