బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫెంగల్’ తుపాన్ పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తీరం దాటినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. తుపాన్ పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ.. క్రమంగా బలహీన పడనుంది. తుపాన్ ప్రభావంతో ఈరోజు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర అంతటా వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాన్ వల్ల…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో శుక్రవారం (నవంబర్ 29) అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది.
APSRTC : ఖరీదైన చీర మాయం కావడంతో ఆర్టీసీ అధికారుల మెడకు చుట్టుకుంది. చీర ఎక్కడుందో తెలియక కార్గో ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ కార్గో సర్వీసులను నిర్వహిస్తోంది. పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేస్తుండటంతో చాలామంది ఆర్టీసీ కార్గో సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వినుకొండ డిపోకి రావాల్సిన పార్శిల్ రాకపోవడంతో కార్గో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఎందుకంత హైరానా అనుకుంటున్నారా..! Hyderabad: నగరంలో వరుస అగ్నిప్రమాద ఘటనలు.. నిన్న జీడిమెట్ల,…
కావలి రూరల్ మండలం బుడం గుంటకు చెందిన బాలయ్య అనే వ్యక్తి నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఐదేళ్లుగా అధికారులు చూట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాలయ్యను అదుపులోకి తీసుకున్నారు. Also Read: Sambal Conflict: సంభల్‌లో ఉద్రిక్తత.. యూపీ సర్కార్పై ప్రియాంక గాంధీ ఫైర్ 2007లో అప్పటి ప్రభుత్వం తనకు…
నెల్లూరులో జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జిల్లా అభివృద్ధిలో భాగ స్వాములు కావాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.. నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు.
Dead Body In Suitcase: ఓ శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై తండ్రి కూతుర్లు విసిరేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అచ్చం ఇదివరకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో లాగా ఘటన జరిగింది. నెల్లూరు నగరంలో మహిళను హత్య చేసి మృతదేహాన్ని సూట్ కేసులో తీసుకొని వచ్చి మీంజూర్ స్టేషన్ వద్ద సూట్ కేసును ప్లాట్‌ఫాంపై విసిరేశారు తండ్రి కూతురు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Read Also: Game…
Jani Master Diwali Celebrations: జానీ మాస్టర్.. గత రెండు నెలలుగా ఈ పేరు తెగ వినపడుతున్న విషయం తెలిసిందే. ఆయన దగ్గర పనిచేసే ఓ మహిళ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ. ఈ కేసులో అనేక నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు అయిన జాని.. ఈ మధ్యనే బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇక జైలు నుంచి విడుదలైన ఈ స్టార్ కొరియోగ్రాఫర్ బయట ఎక్కువగా…
నెల్లూరు నగర శివారులలోని పెన్నా నదిలో ఇసుక రీచ్‌లను అధికారులతో కలిసి మంత్రి డా. పొంగూరు నారాయణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వినా, అక్రమ రవాణా చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని పట్టణాలను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలపై కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని సీఎంకు కలెక్టర్లు, అధికారులు వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు జిల్లా అధికారులు తెలిపారు.