రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది.. కొందరు కోవర్టులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.. టీడీపీలోని చిన్న చిన్న విబేధాలకు కోవర్టులు ఆజ్యం పోస్తున్నారు.. టీడీపీ క్యాడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి కొలుసు పార్థసారథి..
చంద్రబాబు స్టార్ట్ చేశారు.. దాని పర్యవసానం భవిష్యత్తులో భయంకరంగా ఉంటుందంటూ కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. నెల్లూరు సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై వరుస పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.. కల్పిత కథనాలు సృష్టించి.. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారు.. తప్పుడు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లతో కలిపి 1300కు పైగా థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వసతులు, శుభ్రత, ఆహార పదార్థాల ధరలు, ఫైర్ సేఫ్టీ వంటి 32 అంశాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు, కృష్ణా,…
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కాకాణిని జిల్లా పోలీసు ట్రైనింగ్ కాలేజీ నుంచి కోర్టుకు తరలించారు. తొమ్మిది పోలీసు వాహనాల్లో, ప్రత్యేక బలగాల మధ్య వెంకటగిరికి కోర్టుకు తీసుకొచ్చి.. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆదివారం బెంగళూరులో కాకాణిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల…
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అరెస్ట్లతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తిరిగుబాటు తప్పదన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్ష్య పూరితంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. కాకాణిని అదుపులోకి తీసుకోవడంపై నెల్లూరు జిల్లా పోలీసులు అధికారిక ప్రకటన చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ…
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. మాజీ మంత్రి అనిల్ ని పుష్ప మూవీలో మంగళం శ్రీను తో పోల్చి విమర్శలు గుప్పించారు.. కరోనా సమయంలో ఓ హాస్పిటల్ యాజమాన్యాన్ని బెదిరించి మాజీ మంత్రి అనిల్ లక్షల రూపాయలు దండుకున్నారు..
ప్రభుత్వ భూములు ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలి.. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి పొంగూరు నారాయణ..
నాన్నా.. నన్ను రోజూ చిత్ర హింసలు పెట్టి చంపేస్తున్నారు. బయటకు రానివ్వడం లేదు.. నన్ను తిరిగి భారత్కు తీసుకువెళ్లు నాన్న అంటూ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ యువకుడు ఫోన్లో తండ్రికి తన గోడును వెలిబుచ్చాడు.. బాధితుడి తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరుకు చెందిన కాలేషా, బీబీల కుమారుడు నజీర్బాషా డిసెంబర్లో ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు.
40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను మంత్రి నారాయణ పరిష్కరించారు. నెల్లూరు సిటీలో 1400 మంది పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా నదీ తీరాన ఉన్న నివాసాలన్నంటికీ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఈరోజు ఒక పండుగ రోజు అని…
Anil Kumar Yadav: అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయంలో ఎన్నో గనులపై జరిమానాలు విధించారని తెలిపారు. ఇక, శోభారాణి మైన్ కు రూ. 32 కోట్ల మేర ఫైన్ విధించారు.. మైన్స్ శాఖ అధికారి నాయక్.. విచారణ చేసి ఆ గనిలో 35 వేల టన్నుల తెల్లరాయి ఉందని నివేదికలో తెలిపారు.