వైపీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయలో విచారణకు హాజరయ్యారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నల్లపురెడ్డి ప్రసన్న దూషించిన కేసులో అనిల్‌కు నోటీసులు ఇచ్చారు.
జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.. జగన్‌ను చూసేందుకు వెళ్తూ ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చేశారంటూ వైసీపీ నేతలపై దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.. ఇప్పటికే ప్రసన్నకుమార్ రెడ్డిపై రెండు కేసులు నమోదు అయ్యాయి.. అనుమతులు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారని వైసీపీ నేతలపై మరో కేసు నమోదు కాగా.. ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశారు దర్గామిట్ట పోలీసులు..
YS Jagan Accuses CM Chandrababu of Revenge Politics: కాలేజ్ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పుతో కొట్టారని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కాలేజ్ రోజుల్లో అందరూ ఉడుకు రక్తం మీద ఉంటారని, అది గుర్తు పెట్టుకుని ఆయన కొడుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెట్టారని, చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలిచారని ఇదంతా…
తన పర్యటన సందర్భంగా నెల్లూరులో 2 వేల మంది పోలీసులు తిష్ట వేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. వాళ్లంతా తన సెక్యూరిటీ కోసం కాదని, తన కోసం వచ్చే జనాల్ని అడ్డుకోవటానికిని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని, జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అడుగులకు పోలీసులు మడుగులు ఒత్తుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకులు తమ పార్టీ వారిని కలవటం నేరమా?,…
MP Vemireddy Prabhakar Reddy Shutting Down Quartz Business Amid Criticism వేయి మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనుకుంటే.. తనపైనే ఆరోపణలు చేస్తారా? అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిరాశ వ్యక్తం చేశారు. సేవ చేద్దాం అనుకుంటే తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాల కోసం ఫిని క్వార్ట్జ్, లక్ష్మీ క్వార్ట్జ్ పేరుతో రెండు కంపెనీలు పెట్టానని.. ఇప్పుడు క్వార్ట్జ్ వ్యాపారాన్ని మూసేస్తున్నా అని తెలిపారు. ఎవరో ఒకరు ముందుకొచ్చి ఫ్యాక్టరీ…
టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ.. ఆధిపత్యం కోసం కాంగ్రెస్... రాజకీయ ఉనికి కోసం మళ్ళీ తెలుగుదేశంలోకి.... ఆపై ఢిల్లీలో పట్టుకోసం వైసీపీలోకి జంప్. ఇలా కాలమాన పరిస్థితులకు తగ్గట్టు ఎప్పటికప్పుడు వ్యూహాలు, పార్టీలు మారుస్తూ... తన రాజకీయ ఉనికి చాటుకుంటుంటారు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.. అయితే, ఈ వ్యవహారంలో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది..
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. డబ్బుందన్న అహంకారంతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్ది ఇలాంటి దాడులు చేయిస్తుందన్నారు. దాడులు చేసే సంస్కృతిని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లాకు పరిచయం చేశారని విమర్శించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఇప్పుడే వచ్చి అరెస్టు చేసుకోవచ్చన్నారు. తాను నెల్లూరు వదిలి వెళ్లి ఎక్కడో దాక్కున్నట్లు చెప్పడం హాస్యాస్పదం అని ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రసన్న కుమార్…
సభ్య సమాజం తల దించుకునేలా నా పై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి..
అనిల్ కుమార్ మాట్లాడుతూ.. 200 మందికి పైగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పెద్ద పెద్ద మారణాయుధాలతో దాడి చేశారు అని ఆరోపించారు. ఆయన్నీ హతమార్చేందుకు ప్రయత్నం చేశారు.. ఇంట్లో ఉన్న ప్రసన్న తల్లి షాక్ కు గురై ఏదైనా అయ్యుంటే ఎవరిది బాధ్యత అన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి, అనుచరుల పైనా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.