నెల్లూరులో వైసీపీ నేతలు రైతాంగ సమస్యలను ప్రస్తావిస్తూ ర్యాలీ నిర్వహించారు. అన్నదాతకు అండగా చేపట్టిన వైసీపీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు వీఆర్సీ సెంటర్‌కి చేరుకున్నారు.
ఒకటో తేదీ పండుగలా పెన్షన్ ల పంపిణీ సాగుతోంది.. ఒక్కరోజులోనే 99 శాతం పంపిణీ పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్ లు ఇంటి దగ్గర ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బందిపెట్టింది.. కానీ, విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలనతో పెన్షన్ ల ప్రక్రియ గాడిలో పడిందన్నారు..
రాజ్యాధికారం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యులను చంపే సంప్రదాయం మా ఇంట్లో లేదు అని వ్యాఖ్యానించారు కోటంరెడ్డి.. రౌడీ షీటర్లు నా తమ్ముడు గిరిధర్ రెడ్డి అనుచరులు అని ఓ మీడియా రాసిందని మండిపడ్డారు.. విద్యార్ది దశలోనే ఎన్నో పోరాటాలు చేశాను. రౌడీలకు, గుండాలకు భయపడనన్న ఆయన.. వైఎస్ జగన్ ని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేశాను.. 16 నెలలు అధికారాన్ని వదులుకుని టీడీపీలో చేరాను. వైస్సార్సీపీకి సవాల్ విసిరుతున్నా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా..…
MLA Kotamreddy Sridhar Reddy Murder Plan Video: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేయాలని ఐదుగురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేసిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హతమారిస్తే డబ్బే డబ్బు అంటూ రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న సంచలన వీడియో వైరల్‌గా మారింది. మర్డర్ మాస్టర్ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు…
కుబేర సినిమా చూశారుగా .. సేమ్ అచ్చం అలానే స్క్రిప్ట్తో కోట్ల రూపాయలు కొట్టేశారు కొందరు నిందితులు. ఫేక్ సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టి, అందులో అమాయకులను ఉద్యోగులుగాచూపించి, వారి పేరు మీద లక్షలు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు వాటికి ఈఎంఐలు చెల్లించాలంటూ .. బాధితులకు నోటీసులు వస్తున్నాయి. అంతేనా.. ఏజెంట్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
కరుడుగట్టిన నేరగాడికి పనిగట్టుకుని మరీ... పెరోల్ ఇప్పించింది ఎవరు? రౌడీ షీటర్ శ్రీకాంత్ను బయటికి తీసుకురావడంలో ఎవరికి ఇంట్రస్ట్ ఉంది? జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరగాడిని పెరోల్ మీద బయటికి తీసుకువచ్చి ఎలాంటి పనులు చేయించాలనుకున్నారు? పోలీస్, పొలిటికల్ పవర్స్ కలిసి అతనికి ఫేవర్ చేయాలనుకున్నాయా? ఇప్పుడీ వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకోబోతోందా? సిఫారసు లేఖలు ఇచ్చిన ఆ శాసనసభ్యులు ఎవరు?