సభ్య సమాజం తల దించుకునేలా నా పై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి..
అనిల్ కుమార్ మాట్లాడుతూ.. 200 మందికి పైగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పెద్ద పెద్ద మారణాయుధాలతో దాడి చేశారు అని ఆరోపించారు. ఆయన్నీ హతమార్చేందుకు ప్రయత్నం చేశారు.. ఇంట్లో ఉన్న ప్రసన్న తల్లి షాక్ కు గురై ఏదైనా అయ్యుంటే ఎవరిది బాధ్యత అన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి, అనుచరుల పైనా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత.. ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే వైసీపీ నుంచి సస్పెండ్ చేయండి అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సలహా ఇచ్చారు.
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డి.. జిల్లా చరిత్రలో ఈ తరహా దాడులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.. అయితే, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించడం వల్లే నేను కౌంటర్ ఇచ్చాను అన్నారు.. అంతేకాదు, ప్రశాంతి రెడ్డి మీద చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు..
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి కలకలం సృష్టించింది. నెల్లూరు నగరంలోని సావిత్రి నగర్‌లోని ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలోకి చొరబడి దుండగులు.. అల్లకల్లోలం చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలకొట్టి దాన్ని తలకిందులుగా పక్కకి తోసేసారు. ఇంటి రూపు రేఖలే మార్చేశారు.
EX MLA Prasanna Kumar Reddy: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్ లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్ తో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిన ఇంకా పెళ్లి కాలేదా..? ఉద్యోగంలో ప్రమోషన్ కావాలని అనుకుంటున్నారా..? ఇవన్నీ జరగాలంటే మీరు వెంటనే నెల్లూరుజిల్లాకి వచ్చేయండి.. ఎందుకంటే ఈ నెల 6 నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభం కాబోతుంది.. ఇక్కడ కోరుకుంటే అన్నీ కోర్కెలు నెరవేరుతాయాట.. ఇంతకీ దాని చరిత్ర.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూద్దామా..
కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరోషాక్ తగిలింది.. ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్న కాకాణికి మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు.. గత ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలం పంటపాలెంలో దొరికిన మద్యం డంపు కేసులో ఆయన నిందితులుగా ఉండగా.. ఈ నేపథ్యంలో ఆయన్ని ఎక్సైజ్ పోలీసులు పీఈ వారెంట్ పై న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.
వైఎస్ జగన్ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేశారు..
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాకి వైఎస్ జగన్ వస్తున్నారని సమాచారం తెలిసినప్పుడల్లా.. ఏదో ఒక దొంగ కేసు పెడుతున్నారు అని మండిపడ్డారు. 3వ తేదీ పీటీ వారెంట్ వేసి బయటికి తీసుకెళ్లినా.. జగన్ మాత్రం జిల్లాకి రావడం ఖాయం అని తేల్చి చెప్పారు.