MP Vemireddy Prabhakar Reddy Shutting Down Quartz Business Amid Criticism వేయి మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనుకుంటే.. తనపైనే ఆరోపణలు చేస్తారా? అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిరాశ వ్యక్తం చేశారు. సేవ చేద్దాం అనుకుంటే తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాల కోసం ఫిని క్వార్ట్జ్, లక్ష్మీ క్వార్ట్జ్ పేరుతో రెండు కంపెనీలు పెట్టానని.. ఇప్పుడు క్వార్ట్జ్ వ్యాపారాన్ని మూసేస్తున్నా అని తెలిపారు. ఎవరో ఒకరు ముందుకొచ్చి ఫ్యాక్టరీ పెడితే వారికి సాయం చేస్తా అని చెప్పారు. రాబోయే ఇండ్ సోల్ కంపెనీకి ఈ క్వార్ట్జ్ ముడిసరుకు అవసరం అని పేర్కొన్నారు. ఎక్కడా ఇల్లీగల్ వ్యాపారాలు చేయలేదని, మాటలు పడలేకే వ్యాపారాలు ఆపేస్తున్నా అని ఎంపీ వేమిరెడ్డి స్పష్టం చేశారు. క్వార్జ్ వ్యాపారంపై వస్తున్న విమర్శల మీద నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘క్వార్ట్జ్ ఫ్యాక్టరీ పెట్టి వేయి మంది కార్మికులకి ఉపాధి కల్పించాలనుకున్నా. రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టి ఆ మేరకు పనులు చేద్దాం అని ప్రభుత్వాన్ని అడిగాను. నెల్లూరులో నాణ్యమైన క్వార్ట్జ్ దొరుకుతుంది. సోలార్ ప్యానెల్‌లో వాడే ముడిపదార్థాల కోసం ఈ పరిశ్రమ ఉపయోగపడుతుంది. అక్రమ మైనింగ్ లేకుండా న్యాయబద్ధంగా క్వార్ట్జ్ పరిశ్రమ నెలకొల్పాలని అనుకున్నా. చైనాకు మా బృందం వెళ్లి పరిశీలించి వచ్చింది. అందుకోసం 2 కంపెనీలు పెట్టాను. సేవా చేద్దాం అనుకుంటే నామీదే విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ అయ్యాయి. క్వార్జ్ వ్యాపారాలను క్లోజ్ చేసుకుంటున్నాను. ఫ్యాక్టరి పెట్టి ఉపాధి ఇవ్వాలనుకున్నాను.. కానీ కుదరట్లేదు. ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఫ్యాక్టరి పెడితే వారికి సాయం చేస్తాను. ఇల్లీగల్ మైనింగ్ చేస్తే ఒప్పుకోమని ప్రభుత్వం పదే పదే చెబుతుంది’ అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
Also Read: Hyderabad Farmhouse: అచ్చం ‘కుబేర’ సినిమా స్టైల్‌లోనే.. బియ్యం బస్తాలు, అల్మారాలో డబ్బు! చివరకు
‘భవిష్యత్తు లో రాబోయే ఇండో సోల్ కంపెనీకి కూడా ఈ క్వార్జ్ ముడిసరుకు అవసరం. 19 వేల టన్నులు మాత్రమే సరఫరా చేశాం. ఎక్కడా ఇల్లీగల్‌గా వ్యాపారం చెయ్యలేదు. నా గురించి నెగిటివ్‌గా ఎవరైనా మాట్లాడినా వారి ఖర్మకు వాళ్లేపోతారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేస్తా. వీపీఆర్ నేత్ర పేరుతో అన్నీ గ్రామాల్లో ఫ్రీగా కంటి అద్దాలు ఇస్తాం. 19,600 టన్నుల క్వార్ట్జ్‌ని 2024, 2025 సంవత్సరాలలో ఎగుమతి చేశాం. చెన్నై పోర్ట్ నుంచి మేము ఎగుమతి చేసిన బిల్లులు నా దగ్గర ఉన్నాయి. 2023లో సోకాల్డ్ నేతలు 9,65,000 టన్నుల క్వార్ట్జ్‌ని ఎగుమతి చేశారు. నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు. మేము ఎగుమతి చేసిన క్వార్ట్జ్‌ని టెస్ట్ కోసం మాత్రమే వినియోగించాం. 19వేల టన్నులతో ఎన్ని కోట్లు సంపాదిస్తాను?, నాకు అంత అవసరం ఏముంది. 96 కంపెనీలు నెల్లూరు నుంచి 1,60,000 టన్నులు ఈ ఏడాది ఎగుమతి చేశాయి’ అని ఎంపీ వేమిరెడ్డి చెప్పుకొచ్చారు.