నెల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా మరొకరు మృతి చెందగా.. 10 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కావలి ఆస్పత్రికి తరలించారు. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీకి చెందిన టీఎస్ 05 జెడ్ 0249 నంబర్…
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే పొత్తులు, ఎత్తులపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి.. అయితే, ఈ రోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి.. కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి.. మహీధర్ రెడ్డిలతో సమావేశం అయ్యారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.
నెల్లూరు జిల్లాలో ఐదు వేల కోట్ల రూపాయల విలువైన సిలికాన్.. 3 వేల కోట్ల విలువైన తెల్ల రాయిని దోచేశారంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ ను అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి మైన్ ఎదుట నిరసన చేస్తున్నారు.
మిచౌంగ్ తుఫాన్‌తో ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది? ఎంత ఆస్తి నష్టం జరిగింది? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనుంది సెంట్రల్ టీమ్. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తారు.
Michoung Cyclone: తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మిచౌంగ్ ఉత్తర తెలంగాణపై మరింత ప్రభావం చూపనుంది.