బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రేపటికి తుఫాన్‌గా మారనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
వైసీపీకి నెల్లూరు జిల్లా పెట్టని కోటగా నిలిచిందని, ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టం ఏమీలేదు, ఏ ఒక్కరిని పార్టీ వదులుకోదని, జిల్లాలో పార్టీ క్యాడర్ చాలా బలంగా ఉందని దక్షిణ కోస్తా జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల సంఘం నేత ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈరోజు తెల్లవారుజామున నుంచి సోదాలు చేపట్టారు.
నెల్లూరులో రొట్టెల పండుగకు వచ్చిన గుంటూరుకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. పండుగను తిలకించిన వారు తిరిగి తమ స్వస్థలానికి వెళ్లేందుకు.. రైల్వే స్టేషన్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
Nellore: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక ఎనిమిది మంది మృతి చెందారు. ఎంఐసీయూ వార్డులో 6 మంది మృతి చెందారని మృతుల బంధువులు ఆరోపించారు.