నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నూతక్కి వారి కండ్రికలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు జ్వరాలతో సతమతవుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. చాలా మంది నెల్లూరు వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. వారం రోజుల నుంచి జ్వరాలు తగ్గకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్య లోపంతో దోమలు పెరగడంతో.. డెంగీ జ్వరాలేమోనని భయపడుతున్నారు. అంతేకాకుండా.. ఒళ్లు నొప్పులతో కదల్లేకపోతున్నామని నీరసంగా ఉంటోందని బాధితులు వాపోతున్నారు.
ఫేక్‌లే పార్టీ మారతారు.. నిజంగా వైఎస్ జగన్‌ను అభిమానించేవారు పార్టీ మారరు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్సీ అనిల్ కుమార్ యాదవ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా జగన్ కప్పాలని బహిరంగంగా చెప్పిన నేత పార్టీ మారారు.. అందుకే ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుందన్నారు.. జగన్ బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని దుయ్యబట్టారు..
నెల్లూరుకు చెందిన వైసీపీ ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అసంతృప్తిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఎన్నికల సమయంలో అసంతృప్తి సహజంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరైన పనితీరు కనపరచని వారికి పార్టీ టికెట్ నిరాకరించిందన్నారు. వారు అసంతృప్తితో ఉండటం సాధారణమే అని, పార్టీ గెలిచే వారికే టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంటుందని పెద్దిరెడ్డి చెప్పారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అధిష్ఠానం ప్రకటించింది. తన పరిధిలో వచ్చే మూడు శాసనసభ…
కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆయన సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో నా సోదరుడు ప్రసన్నకుమార్ రెడ్డికి సీటు ఇవ్వొద్దు అంటూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాజేంద్రకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో కోవూరులో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికలు వస్తుండటంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అన్ని జిల్లాల్లో తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేస్తున్నారు.. చంద్రబాబుకి పూర్తిగా మతిభ్రమించింది.. చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి అంటూ విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
నెల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా మరొకరు మృతి చెందగా.. 10 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కావలి ఆస్పత్రికి తరలించారు. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీకి చెందిన టీఎస్ 05 జెడ్ 0249 నంబర్…