Ambati Rambabu: నెల్లూరు జిల్లా రాళ్లపాడులో జరిగిన హత్యాయత్నం ఘటనలో గాయపడి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు యువకులను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులో జరిగింది ఒక మారణఖండగా చెప్పవచ్చు అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ముగ్గురు మీద ఉద్దేశపూర్వకంగా కారుతో హత్యాయత్నం చేశారు అని ఆరోపించారు. ప్రమాదం అని ఒక చిన్న కేసు నమోదు చేసినట్లు తెలిసింది.. కాబట్టి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు నేను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారు?.. వారి ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. బాధితులకు మేము అండగా ఉంటామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.