నెల్లూరు జిల్లాలో బంగారు నిక్షేపాలు, రాగి నిల్వలు గుర్తించారు.. ఉదయగిరి మండలం మాసాయిపేటలో బంగారు నిక్షేపాలు, రాగి నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది… జల్లాలోని ఐదు ప్రాంతాల్లో 46 నమూనాలను సేకరించింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. రెండు వేల హెక్టర్లకు పైగా నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది.. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో డ్రిల్లింగ్ పనులు వేగవంతం చేయనున్నారు.. బంగారు నిక్షేపాలతో పాటు రాగి నిల్వలు 20 నుండి 110 మీటర్లలోపు ఉన్నట్లుగా చెబుతోంది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. దొరికిన నిక్షేపాలను నిర్ధారణ కొరకు నమూనాలను ల్యాబ్‌కు పంపించారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు..
Read Also: Megha Akash: గోవాలో గుమ్మడి కాయ కొట్టేసిన చిన్నది!