బీజేపీ పాలనలో లక్షలాది మంది యువత భవిష్యత్త్ నాశనం అయిందని ఆరోపించింది. ఈ లీకేజీ కుంభకోణంలో 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష స్కామ్ కి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన తెలియజేస్తుందని ప్రియాంక గాంధీ అన్నారు.
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల నేతలు కాచిగూడలోని ఆయన ఇంటిని ముట్టడించారు.
Anti Paper Leak Law: వరుస క్వశ్చన్ పేపర్ లీక్‌లతో తీవ్ర ఇబ్బంది పడుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇది జూన్ 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
CSIR-UGC-NET: వరసగా పేపర్ లీకుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నీట్, యూజీసీ-నెట్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి.
UGC-NET case: యూజీసీ-నెట్ పరీక్ష రద్దు చేస్తూ బుధవారం కేంద్ర విద్యామంత్రిశాఖ ఆదేశించింది. పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత పేపర్ లీక్ అయిన విషయం తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
UGC-NET: యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. పరీక్షా ప్రశ్నాపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయినట్లు తేలిన నేపథ్యంలోనే రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం వెల్లడించారు.
NEET: నీట్ అవకతవకలు, యూజీసీ-నెట్ పరీక్షల రద్దుపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి అవినీతి, స్కామ్ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలన్నింటినీ కొట్టిపారేస్తూ.. విద్యార్థులు గందరగోళానికి గురికాకుండా నీట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని విద్యాశాఖ కోరింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కుంభకోణానికి ముగింపు పలకాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ శుక్రవారం అన్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. విద్యా సమగ్రతను కాపాడేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.