UGC-NET case: యూజీసీ-నెట్ పరీక్ష రద్దు చేస్తూ బుధవారం కేంద్ర విద్యామంత్రిశాఖ ఆదేశించింది. పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత పేపర్ లీక్ అయిన విషయం తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డార్క్‌వెబ్‌లో పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తరుణంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పనితీరుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Read Also: IND vs AFG: రాణించిన సూర్య కుమార్.. భారీ స్కోరు చేసిన భారత్
ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు మాట్లాడుతూ.. ఎన్‌టీఏ నిర్మాణం, పనితీరు, పారదర్శకతను పరిశీలించేందుకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డార్క్‌వెబ్‌లో యూజీసీ-నెట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆయన వెల్లడించారు. జూన్ 18న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించగా, రికార్డు స్థాయిలో 11 లక్షల మంది విద్యార్థులు దీనికి రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాతి రోజే పేపర్ లేకేజ్ వ్యవహారం బయటకు రావడంతో పరీక్షను రద్దు చేశారు.
విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రథమ ప్రాధాన్యం అని, దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని చెప్పారు. మరోవైపు యూజీసీ-నెట్ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రానికి వ్యతిరేకంగా పలు పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.
CBI (Central Bureau of Investigation) registers a case against ‘unknown persons’ for compromising the integrity of the UGC NET exam conducted on June 18: CBI pic.twitter.com/BZR1v6saH7
— ANI (@ANI) June 20, 2024