నిన్నటి రోజున దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు జరిగాయి. దేశంలోని 202 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 16 లక్షల మంది ఈ పరీక్షలకు ధరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా తమిళనాడులో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది.…
జాతీయ వైద్య విద్యా ప్రవేశాల పరీక్ష (నీట్)ను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది సుప్రీంకోర్టు.. దీంతో.. నీట్ యథాతథంగా నిర్వహించనున్నారు.. కాగా, సెప్టెంబరు 12న నీట్ నిర్వహణకు ఇప్పటికే ప్రకటన విడుదల కాగా.. అదేరోజు మరికొన్ని పోటీ పరీక్షలు ఉన్నాయని, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కొందరు.. నీట్ వాయిదా వేయాలని, మరో తేదీ ప్రకటించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు విన్నవించారు.. అయితే, నీట్ యథాతథంగా సెప్టెంబరు 12నే జరుగుతుందని స్పష్టం…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న జరగాల్సిన నీట్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. కరోనా కేసులు శరవేగంగా వ్యాపిస్తున్న వేళ ఆఫ్‌లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహించవద్దని ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ లు కూడా దాఖలు అయ్యాయి. అయితే సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఈ పరీక్షలను…