ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది.. ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది.. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు, గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి.. గత ఐదేళ్లల్లో లాకులకు గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి అని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణ నిమిత్తం అంచనాలు వేయమని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నిమ్మల…
ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్ విసిరారు. శుక్రవారం ఆర్జేడీ 28వ వార్షికోత్సవం సందర్భంగా పాట్నాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తేజస్వీ మాట్లాడారు.. నితీష్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, నేరాల్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.
నీట్ పరీక్షను రద్దు చేయాలని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ కేంద్రాన్ని కోరారు. విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రదానోత్సవం రెండో దశ కార్యక్రమంలో తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు, నటుడు విజయ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు.
NEET issue: నీట్ సమస్య, పేపర్ లీకులపై ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో స్పందించారు. దేశంలో ఇలాంటి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ప్రతీ విద్యార్థికి, దేశంలో ప్రతీ యువకుడికి చెబుతున్నానని భరోసా ఇచ్చారు.
NEET-PG Exam: పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్-పీజీ ఎగ్జామ్‌ని ఈ నెలలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం హోం మంత్రిత్వ శాఖ ప్రభుత్వ సైబర్ క్రైమ్ నిరోధక సంస్థ అధికారులతో సమావేశమైన తర్వాత ఈ విషయంపై సంబంధిత వర్గాలు సమాచారమిచ్చాయి.
Parliament: రెండు రోజుల విరామం తర్వాత నేటి నుంచి లోక్‌సభ సమావేశాల్లో తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న సమయంలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోడీ ప్రభుత్వంతో చర్చలు జరపడమే ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు.
నీట్ పేపర్ లీక్ కేసులో జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్, సెంటర్ సూపరింటెండెంట్ ఇంతియాజ్‌లను సీబీఐ ఈరోజు అరెస్ట్ చేసింది. డాక్టర్ ఎహ్సాన్ ఉల్ హక్ నీట్ పరీక్ష జిల్లా కోఆర్డినేటర్‌గా కూడా ఉన్నారు.
హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటిని యువజన విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకల పై ఎన్టీఏని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తిరుకు నిరసనగా నేతలు ముట్టడించారు. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలంటూ.. మళ్లీ తిరిగి ఎగ్జామ్ పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ సమస్య పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో…