అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరమే కానీ, డబ్బు సంపాదించేందుకు మానవ అవయవాలతో వ్యాపారం చేయడం తప్పే కదా. అమాయకులకు డబ్బు ఎరగా చూపి దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు సంచలనం సృష్టిస్తోంది. నిందితుల రిమాండ్ రిపొర్టు లో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. రెండు అక్రమ కిడ్నీ ఆపరేషన్లను గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఒక్కో కిడ్నీ నీ పాతిక లక్షల అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు.…
Madanapalle Kidney Racket: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. విశాఖపట్నం నుంచి మదనపల్లికి మహిళలను తీసుకొచ్చిన కిడ్నీలను తొలగిస్తున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. విశాఖకు చెందిన ఇద్దరు మహిళల కిడ్నీలను మదనపల్లిలో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. అయితే.. కిడ్నీ తొలగించడంతో యమున అనే మహిళ మృతి చెందింది. యమున కుటుంబ సభ్యులు మదనపల్లి టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also: Dubai: దుబాయ్ ఎడారిలో…
80 lakh Car Burnt: అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించడం లేదన్న అక్కసుతో రూ.80లక్షల విలువైన స్పోర్ట్స్ కారును తగులపెట్టిన ఘటన పహాడిషరీఫ్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో దర్యాప్తును ఎన్సీబీ ముమ్మరం చేసింది. గత కొద్దికాలంగా నత్త నడక నడుస్తున్న సుశాంత్ సింగ్ మరణం కేసు ఒక్కసారిగా ఊపందుకొన్నది. ఈ కేసులో కీలకంగా మారిన సిద్ధార్థ్ పితానిని ఈడీ, సీబీఐ, ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో అకస్మాత్తుగా సిద్దార్థ్‌ను అరెస్ట్ చేయడం పట్ల మరోసారి బాలీవుడ్లో కలకలం రేగుతోంది. సిద్ధార్థ్ అరెస్టు తర్వాత సుశాంత్ ఇంట్లో సహాయకులుగా పనిచేసిన నీరజ్, కేశవ్‌ను డ్రగ్స్ కేసులో…