Madanapalle Kidney Racket: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. విశాఖపట్నం నుంచి మదనపల్లికి మహిళలను తీసుకొచ్చిన కిడ్నీలను తొలగిస్తున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. విశాఖకు చెందిన ఇద్దరు మహిళల కిడ్నీలను మదనపల్లిలో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. అయితే.. కిడ్నీ తొలగించడంతో యమున అనే మహిళ మృతి చెందింది. యమున కుటుంబ సభ్యులు మదనపల్లి టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Dubai: దుబాయ్ ఎడారిలో రష్యన్ క్రిప్టో వ్యాపారవేత్త దంపతులు హత్య.. అసలేం జరిగిందంటే..!
విశాఖకు చెందిన పద్మ.. ఇద్దరు మహిళలను మదనపల్లికి తీసుకొచ్చింది. వారికి ఆపరేషన్ చేసిన తర్వాత యమున మృతి చెందింది. దీంతో.. అక్రమ ఆపరేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మదనపల్లి పోలీసులు కిడ్నీ రాకెట్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ రాకెట్ లో కీలక నిందితుడిగా నీరజ్ అనే వ్యక్తిని గుర్తించారు. మరోవైపు కిడ్నీ ముఠాతో కలిసి పని చేస్తున్న గ్లోబల్ ఆస్పత్రి వైద్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు కిడ్నీ ముఠాకు పద్మ అనే మహిళ సహకరిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పద్మ పరారీలో ఉండగా.. ఆమె కోసం గాలిస్తున్నారు.
Read Also: Heartbreaking: ఆకలికి తట్టుకోలేక చిన్నారులు ఏం చేశారంటే..
అయితే, మదనపల్లిలో కిడ్నీ అమ్మకం పై పోలీసుల విచారణ కొనసాగుతోంది.. ఇది కిడ్నీ రాకెట్ కాదని తెలిసిన కుటుంబ సభ్యులే మార్పిడికి అంగీకరించిన డబ్బులు ఇవ్వకపోవడంతోని సమస్య బయటపడిందంటున్నారు పోలీసులు.. నగదు లావాదేవీలలో వచ్చిన తేడాతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది అంటున్నారు.. మృతి చెందిన యమునా వైజాగ్ లో ఓ కిరాణా స్టోర్ లో వర్క్ చేసేది.. భర్త చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమెకు కిడ్నీ ఇస్తే డబ్బులు ఇస్తామంటూ బ్రోకర్ ప్రలోభాలకు గురిచేశాడు.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళల కిడ్నీలు తొలగించినట్ల సమాచారం… మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిలో అక్రమ ఆపరేషన్ జరగగా.. ఆపరేషన్ తర్వాత యమునే అనే మహిళ మృతి చెందడంతో కిడ్నీ ముఠా దందా బయటకు వచ్చింది.. గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. డాక్టర్లు సహా నిందితులను అదుపులోకి తీసుకుని మదనపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..