Minister Nimmala: విజయవాడలోని జలవనరుల క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, ఇతర అధికారులు హాజరయ్యారు.
Read Also: TVS Sport: సరికొత్త రంగులతో మరింత స్టైలిష్ లుక్ లో వచ్చేస్తున్న టీవీఎస్ ‘స్పోర్ట్’
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. రైతుల అవసరాల కోసం చెరువుల్లో పూడిక తీసిన మట్టిని, క్యూబిక్ మీటర్ ఒక్క రూపాయుకే, రైతులకు సరఫరా చేసేలా అనుమతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారని తెలిపారు. చెరువుల్లో పూడిక తీయడంతో పాటు రైతుల పంట పొలాలకు సారవంతమైన మట్టి లభిస్తుంది అన్నారు. గత 6 ఏళ్ళ నుంచి సీఈ స్థాయి నుంచి కింది స్థాయి ఏఈఈ ఉద్యోగుల వరకు ప్రమోషన్స్ కు నోచుకోని, 466 మందికి పదోన్నతులను జలవనరుల శాఖ కల్పించిందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
Read Also: Indus water: “సింధు నది” నీరు పాకిస్తాన్‌కి దక్కకుండా భారత్ వ్యూహం..
అయితే, గత ప్రభుత్వం లష్కర్లకు ఎగ్గొట్టిన ఏడాది జీతం బకాయిల కోసం సుమారు 9 కోట్ల 57 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అలాగే, ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.